సత్యాన్వేషకుల ముఖ్యోద్దేశం ‘సత్యాన్ని’ గ్రహించటం లేదా స్తాపించటం. కాబట్టి ‘సత్యాన్ని’ గ్రహించే ప్రయత్నంలో సిద్ధాంత బోధకు పట్టుబడకుండా “సందర్భనిర్దేశిత భావము”ను గనుక వెంటాడినట్లయితే శ్రేష్టమైన భావమును కలిగి, సమృద్ధి కరమైన జీవితం, ‘క్రీస్తునందుడి’ జీవించవచ్చును.
యేసుక్రీస్తును, యేసు అని పిలవవలెనా లేక యాషువా అనే పిలవవలెనా?
భాషలు తారుమారు చేసిందే దేవుడు అనేది గ్రహించాలి.
ఆదికాండము 11:7 గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.
బైబిల్ గ్రంధామందు ఉన్న రచయితలు రకరకముల సంసృతిలో పెరిగినవారు వారి రచనలు అని కూడా దేవుని చేత ప్రేరేపించబడిన(1 పేతు 2:20,21) వారే రాసినవే…
హీబ్రులో 22 latters ఉంటాయి..
గ్రీకు లో 24
అరమిక్ 22
ఇంగ్లీష్ 26
తెలుగు 56
ఒక భాషలో కొని పదాలు లేవు ఒక్క భాషలో కొని ఎక్కువ పదాలు ఉన్నాయి… భాషలను పుట్టించిందే దేవుడు, బాషాపదాలు ఏదైనా భావం ఒక్కటే ఇచ్చును. యాషువా అనువారు, యేసు అనువారు, జీసస్ అనువారు ముగ్గురు బాషా సంస్కృతులు వేరు వేరు కానీ వారి ముగ్గురి దృష్టి కోణంలో ఉన్న వ్యక్తి మాత్రం ఒక్కడే.
ముగవాడికి బాషా ఉండదు కానీ వాడు భావంతో ఆరాధన చేస్తాడు లేదా వ్యక్తపరుస్తాడు. కాబట్టి ఏదైనా భావం హృదయములో ఉండాలి.
బాబేలు గోపురం దగ్గర దేవుడు మనుష్యుల భాషను తారుమారు చేశాడు (అది 11:6-8) అనేక భాషలు ఆ రోజు ఏర్పడ్డాయి. దేవుడు తారుమారు చేసిన భాషలు అన్ని ఒకేలా లేవు. ఒక భాషలో ఉన్న కొన్ని శబ్దాలు ఇంకో భాషలో లేవు. కొంత కాలానికి వారు మాట్లాడే భాషలకు లిపి కనుగొనబడింది.ఇప్పుడు ఒక భాష మాట్లెడే వ్యక్తి ఇంకొ భాష మాట్లాడే ప్రాoతానికి వెళ్ళినప్పుడు భాషపరమైన కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి.
ఉదా: శంకర్ అనే వ్యక్తి పేరును ఇంగ్లీషులో shankar(షoకర్) అనో sankar (సంకర్)అనో వ్రాస్తారు.ఎందుకంటే ఇంగ్లీషులో’శ’ అనే శబ్దంఇచ్చే అక్షరం (Alpha-bet)లేదు. అలాగే francis అనే పేరు తెలుగులో రాయలన్నా ఇలాంటి సమస్యే ఎదురవుతుంది.తెలుగులో ‘fa’ అనే శబ్దంఇచ్చే అక్షరం లేదు.దానికి బదులు ‘ఫ’ (ppa)ను వాడుతాం.మనం అతని పేరును ప్రాన్సిస్ (pprancis) అని రాస్తాం. సింధు హిందుగా ఇలాగే మారింది. దీనిని తర్జుమా(translation) అనరు. లిప్యoతరీకరణ (translisteration)అంటారు. తెలుగులో కంటే ఇతర భాషలలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటున్నది. ‘యేసు’ పేరు కూడా translate చేయబడలేదు. transliterate చేయబడింది. ఆదిమ సంఘ కాలపు యూదులు హెబ్రీతోతో పాటు గ్రీకు కూడా విరివిగా చేయబడింది. ఎందుకంటే అప్పటి ప్రపంచ భాష గ్రీకు. క్రీస్తు శిష్యులoతా హెబ్రీ భాష మాట్లాడేవారైనప్పటికి వారు సువార్త చెయ్యాలిసిన ప్రాoతాలలో నివసించే వారంతా గ్రీకు మాట్లాడేవారే.
చాలా మంది సందేహం ఇది, ఆత్మ ముక్కులో ఉంటుంది అని కొందరైతే, ఆత్మ లోపల ఉంటుంది అనేది మరి కొందరు, వాక్యము వెలుగులో ఆత్మ అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది అనేది ఆలోచన చేద్దాం..
బైబిల్ నందు ఆత్మ అనే పదానికి గల తర్జుమాలు ఏమిటి?
హెబ్రీలో ఆత్మ యొక్క మూలపదం = Ruach(రూ-ఆహ్)
గ్రీకులో ఆత్మ యొక్క మూలపదం = pneuma(న్యూమా)
Reach(H7307) అనే హీబ్రు పదము పాత నిబంధనలో ఎలా తర్జుమా చేయబడినదో చూద్దాం :
ఊపిరి అని :౼ యోబు 15:30; 19:17; విలాప 4:20;
గాలి/వాయువు అని :౼ యోబు 16:3; యిర్మీయా 5:13; ఆది 8:1; సంఖ్య 11:31; 1రాజులు 18:45
దేవుడు నరునిలో జీవ వాయువును ఊదాడుగాని, ఆత్మ అనే వేరొక పురుషుని శరీరములో పెట్టలేదు అది గ్రహించాలి.. ఆ నోటి ఊపిరి చేత నరుడు జీవాత్మ అయ్యాడు అంటే జీవించే ప్రాణి అయ్యాడు(1కోరింది 15:45).
జీవించే ప్రాణానికి ఏది అవసరం? రక్తము అని బైబిల్ చెప్తుంది. “ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివసించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినయెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము; దానిరక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణా ధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.”(లేవీ 17:13,14).
ప్రాణానికి రక్తము ఎలా ఆధారమో, ఆత్మకు మెదడు అంత ఆధారము. రక్తము లేకపోతే ప్రాణము లేదు, మెదడు లేకపోతే ఎలాంటి ఆలోచన ఉండదు.. నువ్వు మంచిగా ఆలోచన చెయ్యాలన్న లేదా చెడ్డగా ఆలోచన చెయ్యాలన్న కేవలం మెదడు మాత్రమే ఆ ఆలోచనకు ఆధారము, ప్రతి విధమైన ఆలోచనకు, కోరికలకు, నిర్ణయాలకు కేవలం మెదడు మాత్రమే ఆధారము. మెదడును గూర్చి మరింత సమాచారం కోసం ఈ క్రింద లింక్ open చేయండి..
మెదడు(brain) అనేది అంత important అని మనకు తెలుసు. కానీ విచిత్రమేమిటంటే బైబిల్ లో కానీ అపొక్రిపా రచనలలో కానీ BRAIN అనే పదం ఉండదు, ఎందుకంటే 16 శతాబ్దంలో(1669) ఈ పదం బయటకు వచ్చింది, అంతవరకు ఎవరికి మెదడు అనేది ఒకటి ఉందని దాని వలన ఇన్ని జరుగుతున్నవన్నీ తెలియదు. అందుకే దావీదు అంటాడు. ౼ “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము (కీర్తనలు 103:1)“. అంతరంగము ఎలా స్తుతిస్తుంది? కిడ్నీలు, గుండె, జీర్ణశయం, ఎముకలు ఇవి దేవుని స్తుతిస్తాయా?? మెదడు లోని భావాలు తప్ప శరీరములో మరేదీ కూడా దేవుని స్తుతించలేదని అందరికి తెలుసు.
ఎపుడైనా accident కానీ, లేదా తలకు బలమైన గాయం కానీ అయితే అతడు తన పూర్వ జ్ఞాపకాలను మర్చిపోయి అవకాశం ఉంది, అంటే దేవుని గురించి, నువ్వు బైబిల్ నందు పాటించిన అంశాలు, పాడిన పాటలు, చెప్పే వాక్యము, చేసిన బలమైన ప్రార్ధనలు మర్చిపోయే అవకాశం ఉంటుంది, మరి ఆత్మ వేరే వ్యక్తి అయితే తాను ఏమి చేస్తాడు?
మధ్యం బాగా సేవించిన వ్యక్తిని చూడండి అతను ఏదేదో మాట్లాడతాడు లేదా ఏదేదో చేస్తాడు, తనకు లోపల ఉన్న వేరే ఆత్మ ఏమి చేస్తుంది?
ఇలాంటి ప్రశ్నలు ఎనో వస్తాయి కాబట్టి మెదడు ఆలోచనలకు కేంద్రము ఆ ఆలోచనలే ఆత్మ, పరిశుద్ధముగా ఆలోచన చేస్తే అది పరిశుద్ధాత్మ, దుర్మార్గమైనదైతే దురాత్మ, భ్రమపరిచేదిగా ఉంటే భ్రమపరచు ఆత్మ, అబద్దాలు ఆడేదిగా ఉంటే అబద్ధపు ఆత్మ.
1యోహాను 4:6 ౼ మనము దేవుని సంబంధులము; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొనుచున్నాము.
బైబిల్ లో దేవుని స్వభామును ఆత్మ అని, లోక స్వభావమును శరీరము అని పోల్చడం జరిగింది.
ఇశ్రాయేలు సమాజములో పురుష ఆధిక్యత అనేది ఉండేది దానికి గల కారణములు :
Male domination ౼ పురుష ఆధిక్యత అనేది ఇజ్రాయెల్ సంస్కృతిలో ఉండేది, దానికి కారణం ౼ స్త్రీలు చిన్న తనములోనే పెండ్లి చేసుకునేవారు 3,4 నెలల్లో గర్భవతులు అయ్యేవారు దాదాపు ఒక సంవత్సరం ఇంట్లోనే ఉండేవారు, పిల్లలు కనిన తరవాత మరల 3,4 నెలలకు పిల్లలను కనేవారు మరల సంవత్సరం ఇంట్లోనే ఉండేవారు ఎలా 4,5గురు పిల్లలను కనేవారు, ఋతు క్రమములో 7 దినముల పాటు కడగా ఉండవలెను(లేవి 15:19). మరియు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవి, ఇలా స్త్రీలు కనడం పిల్లలను పెంచడం, దేవుని సేవ continue గా పురుషుని వలె సేవ చేయడానికి స్త్రీకి అనుకూలంగా ఉండేది కాదు, దూర ప్రయణములు చేసి వాక్యం ప్రకటించుటకు ఒంటరిగా స్త్రీకి ప్రమాదం ఎందుకంటే అది కామాంధుల ప్రపంచం. ఇలాంటి వ్యవస్థ స్త్రీలకు ఏర్పడడం వలన పురుష ఆధిక్యత అనేది ఉండేది.. అందువలన మొదట అన్నియు పురుషునికి చెప్పినట్టే ఉంటుంది అది స్త్రీలకు కూడా వర్తిస్తుంది..
అధికారము విషయానికి వస్తే :
దేవుని గుడారములో సేవ చేయడానికి ప్రధాన యాజకులు ఉన్నారుగాని ప్రధాన యజకురాలు లేరు. కానీ తను తన భర్తతో కలసి వాక్యము చెప్పవచ్చును. "ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశద పరచిరి (అపో.కార్యములు 18:26 )".
వారి పని : 1 తిమోతికి 5:14
కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని "గృహ పరిపాలన" జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను.
విశ్వాస సంబంధమైన దేవుని యేర్పాటుతో(మూలభాషలో-గృహనిర్వాహకత్వముతో) కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.”
ఎపేసులో పౌలు సందర్శించిన సమయములో అక్కడ భిన్నమైన బోధ, కల్పన కధలు, మితములేని వంశవళిలు చాలా ఉన్నాయి.
అపొ.కా 19:24-41 ౼ “ఏలాగనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియును. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాదేవియైన అర్తెమిదేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియ యందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారైఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి; పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు. మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులైయుండి అతని యొద్దకు వర్తమానము పంపినీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాల మందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను. అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపుఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి. అంతట కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్దనుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యకము. మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు. దేమేత్రికిని అతనితోకూడ నున్న కమసాలులకును ఎవనిమీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యె మాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అదిక్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడీలాగు చెప్పి సభను ముగించెను.”
పై సందర్భములో పౌలు ఎపేసులో ఉన్నపుడు అక్కడ అర్తెమిదేవి అని అన్యదేవత ఆచారములు(సంస్కృతి) ఉన్నట్టు పౌలు చూసాడు, వారి విశ్వాసం :
అర్తెమిదేవి పై నుండి ఉడిపడినట్టు,
ఆ దేవత వలన అందరు సుఖముగా ఉన్నారని,
పురుషుడి ప్రేమేయం లేకుండా స్త్రీ పిల్లలను ఆ దేవి అనుగ్రహముతో కనగలదు అని, ఆమె ఒక సంతానదేవత అని.
పురుషులకు ఈ స్ట్రీలు బోధించాలి అని,
సంకల్పమంతయు స్త్రీలకే ఇవ్వబడిందని,
వారి ఆలయములలో కూడా ఈ స్త్రీలు పూజారులుగా ఉండేవారు
ఎపేసు పరిసర ప్రాంతలలో పూర్తిగా Female domination(స్త్రీ అధిక్యత్య) ఉండేది, చరిత్ర చదివితే ఆ సంస్కృతి యొక్క సమాచారం తెలుస్తుంది.. వారిలో అనేకులు మారి ప్రభువు సంఘానికి వస్తున్నారు, అయితే సమస్య ఏమిటంటే వారి యొక్క మూఢ విశ్వాసములను పూర్తిగా వదలలేక చాలా విషయాల విషయములలో సంఘానికి కొంతమంది స్త్రీలు గలిబిలిగా ఉన్నాయి వారిని హెచ్చరించమని పౌలు తిమోతిని ఎపేసులో(1:3) నిలిచియుండమని హెచ్చరించాడు. మనమైన హిందు లేదా ముస్లిం మతం నుండి వచ్చినవాళ్ళం ఆ సంస్కృతి ఆచార అలవాట్లు ఆ నమ్మకములు త్వరగా పోవు, అలాంటి పరిస్థితినే ఎపేసులో ఉన్న ఇతర స్త్రీల వలన సంఘము పై పెద్ద ఎత్తున ఒత్తిడి ఉన్నది. ఎలాగునంటే 400 సంవత్సరములు ఐగుప్తు దాస్యములో నున్న ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఐగుప్తు సంస్కృతి వదలలేక మోషేను, దేవునుని చాలా ఇబ్బంది పెట్టారు.
అలాంటి పరిస్థితుల్లో పౌలు చెప్తున్నాడు ౼ 1తిమోతికి 2:11,12 ౼ స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. మౌనముగా ఉండటం అంటే మూతిని plaster వేసుకోమని కాదు కానీ, విధేయతతో నేర్చుకోమని అర్ధం. (Like కీర్తనలు 65:1 దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి చెల్లించుటే)
12.స్త్రీమౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. పైన వచనమందు స్త్రీలు అని క్రింద వచనమందు స్త్రీ అన్నాడు అది గమనించాలి, ఎవరైతే ఆ స్త్రీలలో గలిబిలి పుట్టించి సంఘములో స్త్రీ ఆధిపత్యం చేయాలని అనుకుందో ఆ particular స్త్రీని పౌలు గారు హెచ్చరిస్తున్నాడే తప్ప స్త్రీలనందరిని కాదు. తన మాటగా పౌలు ౼ “పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.”
ముగింపు
స్త్రీలు మౌనముగా ఉండాలి అంటే నోటికి plaster వేసుకోవాలి అని అర్ధం కాదు, మౌనముగా విధేయత చూపాలి అని అర్ధం..
ఆయా ప్రాంతాలలో ఉన్న మొదటి శతాబ్ది స్త్రీలకు ఈ ఎపేసులో ఉన్న స్త్రీలకు వ్యత్యాసం ఉంది. ఎవరైనా పత్రిక రాస్తున్నారు అంటే అక్కడ సమస్య ఉంది కాబట్టి సమాధానం కోసం పత్రికలు రాసేవారేగాని సరదాగా ఖాళీగా ఉన్ననని రాసుకోలేదనే విషయాన్ని గ్రహించాలి.
కాబట్టి స్త్రీలు న్యాయకత్వ విషయంలో వారికున్న శారీరిక పరిస్థితిని బట్టి నిరంతరం వారు చేయలేకపోయిన కనీసం వాక్యము, ప్రార్ధన, పాటలు పాడుట, సమాజ మీటింగ్ నందు తమ అభిప్రాయాలను పంచుకోవడానికైనా పురుష పెద్దలు అవకాశం కల్పించాలి అని ఆశిస్తున్నాను..
సంఘములో స్త్రీ న్యాయకత్వం మీద మనం మాట్లాడుకోవడం లేదు అది గమనించాలి, నేటి దినములలో స్త్రీలు సంఘములో వాక్యము చదవకూడదు, ప్రార్థన చేయకూడదు, లేచి పాటలు పాడకూడదు, business meeting లో ఉండకూడదు ఇదే ఆచారముగా కొనసాగుతున్నది, ఈ ఆచారాన్నికి కారణం 1కోరింధి 14:34-36 దానిని గూర్చి మాత్రమే ఈ అంశం.
“స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.” ౼ 1కొరింథీ 14:34-35
ఈ వచనమును తీసుకుని సంఘములో స్త్రీలు మాట్లాడుకుండుటను ఒక కట్టుబాటుగా ఒక ఆచారంగా నేడు క్రీస్తు సంఘాలలో పరంపరగా కొనసాగిస్తున్నారు తప్ప ఎందుకు చెప్పాడు, దేనికి చెప్పాడు, ఏమిటి ఆ సందర్భము అనేది ఆలోచన చేయరు.. 35,36 వచనములలో మాట్లాడకూడదు అని ఉన్నది కాబట్టి మాట్లాడకూడదు అని, స్త్రీలలో దేవునిపై ఉన్న ఉత్సాహమును వారి భావి తరాలకు లేకుండా చేశారు, స్త్రీలు వారి పిల్లలు, వారి వారి పిల్లలు, సంఘముగా కుడుకుంటే మాట్లాడకూడదు, వాక్యం చదవకూడదు, ప్రార్థన చేయకూడదు అనే ఒక నిబంధనను వారి(స్త్రీల) హృదయములో ముద్ర వేశారు ఈ పెద్దలు…
1 కోరింధి 14:34-36
పౌలు దృష్టిలో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలి అనేది ఉద్దేశ్యామా? లేక మన తప్పిదమా?
1కొరింథీ 11:5 ౼ ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో,
అపో.కా 2:16,17 ౼ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా – అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు
అపొ.కా 21:8,9 ౼ మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.
అపొ.కా 18:26 ౼ ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.
రోమీయులకు) 16:1,7 ౼ కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు (deacon) ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని,
7.నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.
కాబట్టి క్రొత్త నిబంధన సంఘములో స్త్రీలు ప్రకటించారు, పరిచర్య చేశారు, సంఘములో ప్రవచించారు.
1కోరింధి 14:34-35 యొక్క సమస్య ఏమిటి?
Male domination ౼ పురుష ఆధిక్యత అనేది ఇజ్రాయెల్ సంస్కృతిలో ఉండేది, దానికి కారణం ౼ స్త్రీలు చిన్న తనములోనే పెండ్లి చేసుకునేవారు 3,4 నెలల్లో గర్భవతులు అయ్యేవారు దాదాపు ఒక సంవత్సరం ఇంట్లోనే ఉండేవారు, పిల్లలు కనిన తరవాత మరల 3,4 నెలలకు పిల్లలను కనేవారు మరల సంవత్సరం ఇంట్లోనే ఉండేవారు ఎలా 4,5గురు పిల్లలను కనేవారు మరియు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవి, ఇలా స్త్రీలు కనడం పిల్లలను పెంచడం ఇలాంటి వ్యవస్థ స్త్రీలకు ఏర్పడడం వలన పురుష ఆధిక్యత అనేది ఉండేది.. అందువలన మొదట అన్నియు పురుషునికి చెప్పినట్టే ఉంటుంది అది స్త్రీలకు కూడా వర్తిస్తుంది..
1కొరింథీ 14:5 ౼ మీరందరు(స్ర్రీలు కూడా) భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను.
1కొరింథీ 14:23 ౼ సంఘమంతయు(స్ర్రీలు కూడా)ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవి శ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱి మాటలాడుచున్నారని అనుకొందురు కదా?
>> స్త్రీ, పురుషులు ఇరువురు ఆ సంఘములో ప్రవచిస్తున్నట్టు, భాషలు మాట్లాడుతునట్టు పైన వచనములలో ఉన్నది. <<
కోరింధి స్థానిక సంఘములో స్త్రీ పురుషులకు ఆత్మ వరములు ఉన్నవి కానీ వారిలో ఒక క్రమశిక్షణ లేదు అనే సమాచారము పౌలు నొద్దకు వచ్చెను దానికై పౌలు ఈ విధముగా చెప్తున్నాడు ౼
1కొరింథీ 14:26 ౼ సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడివచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెననియున్నాడు; మరియొకడు బోధింపవలెననియున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటన చేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్పవలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.
1కొరింథీ 14:39,40 కాబట్టి నా సహోదరులారా(అందరిని), ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.
1కొరింథీ 14:33 ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.
క్రమశిక్షణలో భాగమే కొందరు మౌనముగా నుండుటకు ఉపదేశింపబడిరి.
1కొరింథీ 14:27,28 ౼ భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.
1. పైన వాన్నియు జరుగుట లేదు గనుక పౌలు భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను అని, కూర్చున్న మరియొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. అని సూచనలు ఇస్తున్నాడు..
2. పురుషులను మౌనముగా ఉండమన్నాడు, పురుషులు మౌనముగా ఉండమని 2 సార్లు చెప్పబడితే అది కంటికి కనపడదు కాదు స్త్రీలు మౌనముగా ఉండమని ఒక సారి చెబితే అది మాత్రమే కనపడుతుంది.
35వ స్త్రీలు మాట్లాడకూడదు అని ధర్మశాస్త్రమును చెప్పుచున్నదా?
స్త్రీలు మౌనముగా ఉండవలేనని ధర్మశాస్త్రములో ఎక్కడుంది? మోషే చెప్పాడా లేక ప్రవక్తలు చెప్పారా? ఎక్కడ ఆ మాట లేదు.. లేనప్పుడు ఎందుకు ధర్మశాస్త్రము చెప్పుచున్నది అని అన్నాడు?
యూదులకు MISHNAH అనే సాంప్రదాయ సాంస్కృతిక ధర్మశాస్త్రం ఒకటి ఉంది అందులో వాళ్ళ సంస్కృతి సంప్రదాయలు జీవన విధానము గూర్చి ఉంటుంది. Mishnah berurah – vol 9:3B ఈ మాట ఉంది.
గమనిక :
దేవుడు తన వాక్యాన్ని నేరుగా ఇచ్చి ఇదే ఇక మీరు చెయ్యాలి అని చెప్పేలేదు, వాళ్ళ సంస్కృతి మధ్యలో దీపంలాగా తన ధర్మశాస్త్రాని పెట్టాడు. ఉదాహరణకు : దేవుడు – నా బాషా హెబ్రీ బాషా కాబట్టి అందరూ హెబ్రీనే మాట్లాడాలి అంటే కుదురుతుందా? సున్నతి అందరూ చేయించుకోవాలి అంటే అది కుదురుతుందా? కాబట్టి దేవుడు నేడు తన వాక్కును భిన్న సంస్కృతిలు ఉన్న ఈ ప్రపంచంలో దీపము వలె ఉంచాడు..
అలానే ఇజ్రాయెల్ వారికి ఈ mishnah అనే చట్టం ఒకటి ఉంది అందులో స్త్రీలు మౌనముగా ఉండాలి అని రాసి ఉంది..
1కొరింథీ 14:35 ౼ “వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను;”
భర్తలు లేకపోతే? పెళ్లి కానివారు ఉంటారు వాళ్లకు భర్త ఉండదు వాళ్లు ఎవరిని అడగాలి? ఒంటరి మహిళలు పరిస్థితి? వీళ్ళు పక్కంటి భర్తలను అడిగి నేర్చుకోవలనా అర్ధం?? ఏమిటిది??
ఇదే పత్రికలో ముందే భార్య భర్తల గురించి చెప్పాడు 1కోరింది 7వ అధ్యాయం 14:35లో వాళ్లకు సంబంధించినది.
1కొరింథీ 14:36 “దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా?”
ఇంగ్లీష్ బైబిల్ లో “ఏంటి?” అంటు start అవుతుంది వాక్యము ౼ What? was it from you that the word of God went out? or did it only come in to you? అంటే 34,35 వచనములు ఎవరో అంటే దానికి counter సమాధానంగా పౌలు చెప్తున్నాడు. “ఏంటి? దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా?” కాబట్టి 34,35 వచనములు పౌలు మాటలు కావు అనేది తెలిసిపోయింది, అక్కడ వారి మాటలకు 36 వచనము counter సమాధానంగా ఉంది. 1కొరింథీ 14:37,38 ౼ ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధిననియైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను. ఎవడైనను తెలియనివాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము(అనేక ప్రాచీన ప్రతులలో-వాడు తెలియబడిన వాడు కాడు అని పాఠాంతరము).
ముగింపు
గలతీయులకు 3:27,28 ౼ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
స్త్రీలను ఆ సంఘ పరిస్థితులను, వాతావరణమును బట్టి Allowed చేయవచ్చు. (కొన్ని ప్రాంతములలో పరిస్థితులు సరిగా ఉండకపోవొచ్చు ఎలాగునంటే సంఘములో కొందరి కామపు దృష్టిరిత్యా స్త్రీలను మౌనముగా ఉంచవచ్చు గాని ఆ మౌననికి 1కోరింది 14 అధ్యాయం కారణం కాదు అనేది గ్రహించాలి).
స్త్రీలు సంఘములో వాక్యము చదవవచ్చు.
ప్రార్ధన చేయవచ్చు.
లేచి పాటలు పాడవచ్చు.
Business meetings లో వారు తమ అభిప్రాయాలను తెలపనువచ్చు.
అంతేగాని స్త్రీతో నీవు సంఘములో వాక్యము చదవకు, ప్రార్ధన చేయకు, లేచి పాటలు పాడకు అని అనడం, అలా స్త్రీల విషయములో నీవు చూపు కఠిన వివక్ష దేవునికి మహిమకరము కాదు. స్త్రీలు అలా చేస్తే అది వారికి పాపమా? దయతో ఆలోచన చేయండి, అవసరాన్ని బట్టి వారికి అవకాశం కల్పించండి.
పరలోకములో యేసుక్రీస్తు ఆత్మగా కానీ వ్యక్తిగా కానీ లేడు. అలా ఉన్నాడు అని విశ్వసిస్తే సృష్టికి మునుపు యెహోవా లాంటి అదే స్థాయిగలిగి దేవుడు అనబడిన యేసును చివరికి వచ్చే సమయానికి దేవుని సేవకునిగా చూడవాల్సి వస్తుంది.
త్రిత్వ/దేవత్వవాదుల విశ్వాసం :
యేసు దేవుడని మరో యెహోవా అని (యెహోవాతో ఏ మాత్రం తక్కువ స్థాయి కానీ వాడని), సరిసమానుడని వారి విశ్వాసం. ఏ విషయములోనైన నిన్న నేడు ఏకరితిగా ఉన్నవాడు(అప్పుడొకలగా, ఇప్పుడొక్కలగా వుండాడు), అని విశ్వసించేదరు.
ఇందులో చిక్కుముడి ఏమిటంటే దేవునికి దేవుడుండటం, ఇదెలా సాధ్యం. సమాన స్థాయిలో ఉన్న దేవునికి దేవుడు ఎలా ఉండగలడు, మనీషికి ప్రకృతికి దేవుడు ఉంటాడు ఎందుకంటే అవి దేవుడు చేసాడు కాబట్టి..
యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు ఎందుకంటే : “1తిమోతికి 2:5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.” నరులకు మధ్యవర్తి ఒక నరుడే కానీ దేవుడు కాదు, యేసుక్రీస్తు కూడా నరుడే అందుకే ఆయనకు మనవలె దేవుడు ఉన్నాడు..
భూమి మీద క్రీస్తుకు యెహోవానే దేవుడు :
యోహాను 17:3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.
మార్కు 12:29: అందుకు యేసుప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.
మార్కు 15:34: మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
చనిపోయి తిరిగి లేపబడిన తరువాత కూడా క్రీస్తుకు యెహోవానే దేవుడు :
యోహాను 20:17 అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
పరలోకములో కూడా క్రీస్తుకు యెహోవానే దేవుడు :
ప్రకటన గ్రంథం 3:2: నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.
ప్రకటన గ్రంథం 3:12: జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
ఎఫెసీయులకు 1:19: మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి,
ఎఫెసీయులకు 1:3: మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక.
కొలస్సీయులకు 1:4: మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
దీనిని బట్టి మనకు ఏమి తెలుస్తుంది ౼ ఎల్లపుడు యేసుక్రీస్తు తనకు దేవుడిగా యెహోవాను కలిగియున్నాడు అని.
ఎందుకు యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు? కారణము
యెహోవా యెహోవాలాంటి మరో దేవుడు ఉన్నాడు అనుకుంటే, యేసుకు దేవుడు ఉన్నట్టే, యెహోవాకు కూడా దేవుడు ఉండాలి కదా!.. కాబట్టి యేసు మనలాంటి రక్త మాంసములు గలవాడే.
నరుడు
గొర్రెపిల్ల
పంపబడినవాడు
సేవకుడు/దాసుడు
ప్రధాన యాజకుడు
ప్రార్ధన చేయువాడు
ఆరాధికుడు
ఉత్తరవాది
మానవుడు దేవుడు కాలేడు :
యెహేజ్కేలు 28:9: నేను దేవుడనని నిన్ను చంపువానియెదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువానిచేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా.
ముగింపు :
యేసుక్రీస్తు సృష్టికి మునుపు మరో యెహోవాలగా ఉన్నాడు అని విశ్వసిస్తే, సరిగా గమనించండి ౼ క్రీస్తు నిన్నొకలాగా(దేవుడిగా) నేడోకాలగా(దేవుని సేవకుడిగా) ఉనట్టు ఉంటుంది.
కానీ వాస్తవానికి యేసుక్రీస్తు తనను పుట్టించిన దేవునికి గొప్ప భక్తిపరుడు, అనేక శ్రమలు, రోధనలు, యచనలు, ద్వారా సంపూర్ణత సాధించాడు. మనకు మాదిరిగా నిలిచాడు, అన్నిటిని జయించాడు అందుకే మనకు ప్రభువైనాడు..
హెబ్రీయులకు 2:10: ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను(యేసును) శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు(యెహోవాకు) తగును.