1తిమోతి 2:9-15

ముందుమాట :
- తిమోతికి ఈ పత్రిక ఎవరు రాసారు?
- తిమోతి ఎక్కడ ఉన్నాడు?
- తిమోతి ఉన్న ప్రాంతము యొక్క సంస్కృతి(culture) ఏమిటి?
- తిమోతికి వద్ద స్త్రీల ప్రస్తావన ఎందుకు వచ్చింది?
ముందుగా ఇవి పరిశీలన చేయాలి. ఆ తరవాత స్త్రీలకు ఎందుకు ఆ ఆజ్ఞ వచ్చినదో అర్ధం అవుతుంది..
పూర్వ చరిత్ర
1తిమోతికి 1:3,4 ౼ “నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు
- భిన్నమైన బోధ చేయవద్దనియు,
- కల్పనాకథలును
- మితము లేని వంశావళులును,
విశ్వాస సంబంధమైన దేవుని యేర్పాటుతో(మూలభాషలో-గృహనిర్వాహకత్వముతో) కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.”
ఎపేసులో పౌలు సందర్శించిన సమయములో అక్కడ భిన్నమైన బోధ, కల్పన కధలు, మితములేని వంశవళిలు చాలా ఉన్నాయి.
అపొ.కా 19:24-41 ౼ “ఏలాగనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియును. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాదేవియైన అర్తెమిదేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియ యందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారైఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి; పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు. మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులైయుండి అతని యొద్దకు వర్తమానము పంపినీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాల మందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను. అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపుఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి. అంతట కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్దనుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యకము. మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు. దేమేత్రికిని అతనితోకూడ నున్న కమసాలులకును ఎవనిమీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యె మాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అదిక్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడీలాగు చెప్పి సభను ముగించెను.”
పై సందర్భములో పౌలు ఎపేసులో ఉన్నపుడు అక్కడ అర్తెమిదేవి అని అన్యదేవత ఆచారములు(సంస్కృతి) ఉన్నట్టు పౌలు చూసాడు, వారి విశ్వాసం :
- అర్తెమిదేవి పై నుండి ఉడిపడినట్టు,
- ఆ దేవత వలన అందరు సుఖముగా ఉన్నారని,
- పురుషుడి ప్రేమేయం లేకుండా స్త్రీ పిల్లలను ఆ దేవి అనుగ్రహముతో కనగలదు అని, ఆమె ఒక సంతానదేవత అని.
- పురుషులకు ఈ స్ట్రీలు బోధించాలి అని,
- సంకల్పమంతయు స్త్రీలకే ఇవ్వబడిందని,
- వారి ఆలయములలో కూడా ఈ స్త్రీలు పూజారులుగా ఉండేవారు
ఎపేసు పరిసర ప్రాంతలలో పూర్తిగా Female domination(స్త్రీ అధిక్యత్య) ఉండేది, చరిత్ర చదివితే ఆ సంస్కృతి యొక్క సమాచారం తెలుస్తుంది.. వారిలో అనేకులు మారి ప్రభువు సంఘానికి వస్తున్నారు, అయితే సమస్య ఏమిటంటే వారి యొక్క మూఢ విశ్వాసములను పూర్తిగా వదలలేక చాలా విషయాల విషయములలో సంఘానికి కొంతమంది స్త్రీలు గలిబిలిగా ఉన్నాయి వారిని హెచ్చరించమని పౌలు తిమోతిని ఎపేసులో(1:3) నిలిచియుండమని హెచ్చరించాడు. మనమైన హిందు లేదా ముస్లిం మతం నుండి వచ్చినవాళ్ళం ఆ సంస్కృతి ఆచార అలవాట్లు ఆ నమ్మకములు త్వరగా పోవు, అలాంటి పరిస్థితినే ఎపేసులో ఉన్న ఇతర స్త్రీల వలన సంఘము పై పెద్ద ఎత్తున ఒత్తిడి ఉన్నది. ఎలాగునంటే 400 సంవత్సరములు ఐగుప్తు దాస్యములో నున్న ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఐగుప్తు సంస్కృతి వదలలేక మోషేను, దేవునుని చాలా ఇబ్బంది పెట్టారు.
అలాంటి పరిస్థితుల్లో పౌలు చెప్తున్నాడు ౼ 1తిమోతికి 2:11,12 ౼ స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. మౌనముగా ఉండటం అంటే మూతిని plaster వేసుకోమని కాదు కానీ, విధేయతతో నేర్చుకోమని అర్ధం. (Like కీర్తనలు 65:1 దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి చెల్లించుటే)
12.స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. పైన వచనమందు స్త్రీలు అని క్రింద వచనమందు స్త్రీ అన్నాడు అది గమనించాలి, ఎవరైతే ఆ స్త్రీలలో గలిబిలి పుట్టించి సంఘములో స్త్రీ ఆధిపత్యం చేయాలని అనుకుందో ఆ particular స్త్రీని పౌలు గారు హెచ్చరిస్తున్నాడే తప్ప స్త్రీలనందరిని కాదు. తన మాటగా పౌలు ౼ “పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.”
ముగింపు
- స్త్రీలు మౌనముగా ఉండాలి అంటే నోటికి plaster వేసుకోవాలి అని అర్ధం కాదు, మౌనముగా విధేయత చూపాలి అని అర్ధం..
- ఆయా ప్రాంతాలలో ఉన్న మొదటి శతాబ్ది స్త్రీలకు ఈ ఎపేసులో ఉన్న స్త్రీలకు వ్యత్యాసం ఉంది. ఎవరైనా పత్రిక రాస్తున్నారు అంటే అక్కడ సమస్య ఉంది కాబట్టి సమాధానం కోసం పత్రికలు రాసేవారేగాని సరదాగా ఖాళీగా ఉన్ననని రాసుకోలేదనే విషయాన్ని గ్రహించాలి.
కాబట్టి స్త్రీలు న్యాయకత్వ విషయంలో వారికున్న శారీరిక పరిస్థితిని బట్టి నిరంతరం వారు చేయలేకపోయిన కనీసం వాక్యము, ప్రార్ధన, పాటలు పాడుట, సమాజ మీటింగ్ నందు తమ అభిప్రాయాలను పంచుకోవడానికైనా పురుష పెద్దలు అవకాశం కల్పించాలి అని ఆశిస్తున్నాను..
No comments:
Post a Comment