
ముందుమాట :
- పరలోకములో యేసుక్రీస్తు ఆత్మగా కానీ వ్యక్తిగా కానీ లేడు. అలా ఉన్నాడు అని విశ్వసిస్తే సృష్టికి మునుపు యెహోవా లాంటి అదే స్థాయిగలిగి దేవుడు అనబడిన యేసును చివరికి వచ్చే సమయానికి దేవుని సేవకునిగా చూడవాల్సి వస్తుంది.
త్రిత్వ/దేవత్వవాదుల విశ్వాసం :
- యేసు దేవుడని మరో యెహోవా అని (యెహోవాతో ఏ మాత్రం తక్కువ స్థాయి కానీ వాడని), సరిసమానుడని వారి విశ్వాసం. ఏ విషయములోనైన నిన్న నేడు ఏకరితిగా ఉన్నవాడు(అప్పుడొకలగా, ఇప్పుడొక్కలగా వుండాడు), అని విశ్వసించేదరు.
ఇందులో చిక్కుముడి ఏమిటంటే దేవునికి దేవుడుండటం, ఇదెలా సాధ్యం. సమాన స్థాయిలో ఉన్న దేవునికి దేవుడు ఎలా ఉండగలడు, మనీషికి ప్రకృతికి దేవుడు ఉంటాడు ఎందుకంటే అవి దేవుడు చేసాడు కాబట్టి..
యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు ఎందుకంటే : “1తిమోతికి 2:5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.” నరులకు మధ్యవర్తి ఒక నరుడే కానీ దేవుడు కాదు, యేసుక్రీస్తు కూడా నరుడే అందుకే ఆయనకు మనవలె దేవుడు ఉన్నాడు..
భూమి మీద క్రీస్తుకు యెహోవానే దేవుడు :
- యోహాను 17:3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.
- మార్కు 12:29: అందుకు యేసుప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.
- మార్కు 15:34: మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
చనిపోయి తిరిగి లేపబడిన తరువాత కూడా క్రీస్తుకు యెహోవానే దేవుడు :
- యోహాను 20:17 అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
పరలోకములో కూడా క్రీస్తుకు యెహోవానే దేవుడు :
- ప్రకటన గ్రంథం 3:2: నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.
- ప్రకటన గ్రంథం 3:12: జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
యేసుకు యెహోవానే దేవుడని అపోస్తులుల బోదె సాక్ష్యం :
- ఎఫెసీయులకు 1:19: మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి,
- ఎఫెసీయులకు 1:3: మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక.
- కొలస్సీయులకు 1:4: మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
దీనిని బట్టి మనకు ఏమి తెలుస్తుంది ౼ ఎల్లపుడు యేసుక్రీస్తు తనకు దేవుడిగా యెహోవాను కలిగియున్నాడు అని.
ఎందుకు యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు? కారణము
యెహోవా యెహోవాలాంటి మరో దేవుడు ఉన్నాడు అనుకుంటే, యేసుకు దేవుడు ఉన్నట్టే, యెహోవాకు కూడా దేవుడు ఉండాలి కదా!.. కాబట్టి యేసు మనలాంటి రక్త మాంసములు గలవాడే.
- నరుడు
- గొర్రెపిల్ల
- పంపబడినవాడు
- సేవకుడు/దాసుడు
- ప్రధాన యాజకుడు
- ప్రార్ధన చేయువాడు
- ఆరాధికుడు
- ఉత్తరవాది
మానవుడు దేవుడు కాలేడు :
యెహేజ్కేలు 28:9: నేను దేవుడనని నిన్ను చంపువానియెదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువానిచేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా.
ముగింపు :
యేసుక్రీస్తు సృష్టికి మునుపు మరో యెహోవాలగా ఉన్నాడు అని విశ్వసిస్తే, సరిగా గమనించండి ౼ క్రీస్తు నిన్నొకలాగా(దేవుడిగా) నేడోకాలగా(దేవుని సేవకుడిగా) ఉనట్టు ఉంటుంది.
కానీ వాస్తవానికి యేసుక్రీస్తు తనను పుట్టించిన దేవునికి గొప్ప భక్తిపరుడు, అనేక శ్రమలు, రోధనలు, యచనలు, ద్వారా సంపూర్ణత సాధించాడు. మనకు మాదిరిగా నిలిచాడు, అన్నిటిని జయించాడు అందుకే మనకు ప్రభువైనాడు..
హెబ్రీయులకు 2:10: ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను(యేసును) శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు(యెహోవాకు) తగును.
No comments:
Post a Comment