
యేసుక్రీస్తును, యేసు అని పిలవవలెనా లేక యాషువా అనే పిలవవలెనా?
భాషలు తారుమారు చేసిందే దేవుడు అనేది గ్రహించాలి.
- ఆదికాండము 11:7 గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.
బైబిల్ గ్రంధామందు ఉన్న రచయితలు రకరకముల సంసృతిలో పెరిగినవారు వారి రచనలు అని కూడా దేవుని చేత ప్రేరేపించబడిన(1 పేతు 2:20,21) వారే రాసినవే…
- హీబ్రులో 22 latters ఉంటాయి..
- గ్రీకు లో 24
- అరమిక్ 22
- ఇంగ్లీష్ 26
- తెలుగు 56
ఒక భాషలో కొని పదాలు లేవు ఒక్క భాషలో కొని ఎక్కువ పదాలు ఉన్నాయి… భాషలను పుట్టించిందే దేవుడు, బాషాపదాలు ఏదైనా భావం ఒక్కటే ఇచ్చును. యాషువా అనువారు, యేసు అనువారు, జీసస్ అనువారు ముగ్గురు బాషా సంస్కృతులు వేరు వేరు కానీ వారి ముగ్గురి దృష్టి కోణంలో ఉన్న వ్యక్తి మాత్రం ఒక్కడే.
ముగవాడికి బాషా ఉండదు కానీ వాడు భావంతో ఆరాధన చేస్తాడు లేదా వ్యక్తపరుస్తాడు. కాబట్టి ఏదైనా భావం హృదయములో ఉండాలి.
బాబేలు గోపురం దగ్గర దేవుడు మనుష్యుల భాషను తారుమారు చేశాడు (అది 11:6-8) అనేక భాషలు ఆ రోజు ఏర్పడ్డాయి. దేవుడు తారుమారు చేసిన భాషలు అన్ని ఒకేలా లేవు. ఒక భాషలో ఉన్న కొన్ని శబ్దాలు ఇంకో భాషలో లేవు. కొంత కాలానికి వారు మాట్లాడే భాషలకు లిపి కనుగొనబడింది.ఇప్పుడు ఒక భాష మాట్లెడే వ్యక్తి ఇంకొ భాష మాట్లాడే ప్రాoతానికి వెళ్ళినప్పుడు భాషపరమైన కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి.
- ఉదా: శంకర్ అనే వ్యక్తి పేరును ఇంగ్లీషులో shankar(షoకర్) అనో sankar (సంకర్)అనో వ్రాస్తారు.ఎందుకంటే ఇంగ్లీషులో’శ’ అనే శబ్దంఇచ్చే అక్షరం (Alpha-bet)లేదు. అలాగే francis అనే పేరు తెలుగులో రాయలన్నా ఇలాంటి సమస్యే ఎదురవుతుంది.తెలుగులో ‘fa’ అనే శబ్దంఇచ్చే అక్షరం లేదు.దానికి బదులు ‘ఫ’ (ppa)ను వాడుతాం.మనం అతని పేరును ప్రాన్సిస్ (pprancis) అని రాస్తాం. సింధు హిందుగా ఇలాగే మారింది. దీనిని తర్జుమా(translation) అనరు. లిప్యoతరీకరణ (translisteration)అంటారు. తెలుగులో కంటే ఇతర భాషలలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటున్నది. ‘యేసు’ పేరు కూడా translate చేయబడలేదు. transliterate చేయబడింది. ఆదిమ సంఘ కాలపు యూదులు హెబ్రీతోతో పాటు గ్రీకు కూడా విరివిగా చేయబడింది. ఎందుకంటే అప్పటి ప్రపంచ భాష గ్రీకు. క్రీస్తు శిష్యులoతా హెబ్రీ భాష మాట్లాడేవారైనప్పటికి వారు సువార్త చెయ్యాలిసిన ప్రాoతాలలో నివసించే వారంతా గ్రీకు మాట్లాడేవారే.
No comments:
Post a Comment