1 కోరింధి 14:34-36

సంఘములో స్త్రీ న్యాయకత్వం మీద మనం మాట్లాడుకోవడం లేదు అది గమనించాలి, నేటి దినములలో స్త్రీలు సంఘములో వాక్యము చదవకూడదు, ప్రార్థన చేయకూడదు, లేచి పాటలు పాడకూడదు, business meeting లో ఉండకూడదు ఇదే ఆచారముగా కొనసాగుతున్నది, ఈ ఆచారాన్నికి కారణం 1కోరింధి 14:34-36 దానిని గూర్చి మాత్రమే ఈ అంశం.
“స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.” ౼ 1కొరింథీ 14:34-35
ఈ వచనమును తీసుకుని సంఘములో స్త్రీలు మాట్లాడుకుండుటను ఒక కట్టుబాటుగా ఒక ఆచారంగా నేడు క్రీస్తు సంఘాలలో పరంపరగా కొనసాగిస్తున్నారు తప్ప ఎందుకు చెప్పాడు, దేనికి చెప్పాడు, ఏమిటి ఆ సందర్భము అనేది ఆలోచన చేయరు.. 35,36 వచనములలో మాట్లాడకూడదు అని ఉన్నది కాబట్టి మాట్లాడకూడదు అని, స్త్రీలలో దేవునిపై ఉన్న ఉత్సాహమును వారి భావి తరాలకు లేకుండా చేశారు, స్త్రీలు వారి పిల్లలు, వారి వారి పిల్లలు, సంఘముగా కుడుకుంటే మాట్లాడకూడదు, వాక్యం చదవకూడదు, ప్రార్థన చేయకూడదు అనే ఒక నిబంధనను వారి(స్త్రీల) హృదయములో ముద్ర వేశారు ఈ పెద్దలు…
1 కోరింధి 14:34-36
పౌలు దృష్టిలో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలి అనేది ఉద్దేశ్యామా? లేక మన తప్పిదమా?
- 1కొరింథీ 11:5 ౼ ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో,
- అపో.కా 2:16,17 ౼ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా – అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు
- అపొ.కా 21:8,9 ౼ మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.
- అపొ.కా 18:26 ౼ ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.
- రోమీయులకు) 16:1,7 ౼ కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు (deacon) ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని,
- 7.నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.
కాబట్టి క్రొత్త నిబంధన సంఘములో స్త్రీలు ప్రకటించారు, పరిచర్య చేశారు, సంఘములో ప్రవచించారు.
1కోరింధి 14:34-35 యొక్క సమస్య ఏమిటి?
Male domination ౼ పురుష ఆధిక్యత అనేది ఇజ్రాయెల్ సంస్కృతిలో ఉండేది, దానికి కారణం ౼ స్త్రీలు చిన్న తనములోనే పెండ్లి చేసుకునేవారు 3,4 నెలల్లో గర్భవతులు అయ్యేవారు దాదాపు ఒక సంవత్సరం ఇంట్లోనే ఉండేవారు, పిల్లలు కనిన తరవాత మరల 3,4 నెలలకు పిల్లలను కనేవారు మరల సంవత్సరం ఇంట్లోనే ఉండేవారు ఎలా 4,5గురు పిల్లలను కనేవారు మరియు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవి, ఇలా స్త్రీలు కనడం పిల్లలను పెంచడం ఇలాంటి వ్యవస్థ స్త్రీలకు ఏర్పడడం వలన పురుష ఆధిక్యత అనేది ఉండేది.. అందువలన మొదట అన్నియు పురుషునికి చెప్పినట్టే ఉంటుంది అది స్త్రీలకు కూడా వర్తిస్తుంది..
- 1కొరింథీ 14:5 ౼ మీరందరు(స్ర్రీలు కూడా) భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను.
- 1కొరింథీ 14:23 ౼ సంఘమంతయు(స్ర్రీలు కూడా)ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవి శ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱి మాటలాడుచున్నారని అనుకొందురు కదా?
>> స్త్రీ, పురుషులు ఇరువురు ఆ సంఘములో ప్రవచిస్తున్నట్టు, భాషలు మాట్లాడుతునట్టు పైన వచనములలో ఉన్నది. <<
కోరింధి స్థానిక సంఘములో స్త్రీ పురుషులకు ఆత్మ వరములు ఉన్నవి కానీ వారిలో ఒక క్రమశిక్షణ లేదు అనే సమాచారము పౌలు నొద్దకు వచ్చెను దానికై పౌలు ఈ విధముగా చెప్తున్నాడు ౼
- 1కొరింథీ 14:26 ౼ సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడివచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెననియున్నాడు; మరియొకడు బోధింపవలెననియున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటన చేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్పవలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.
- 1కొరింథీ 14:39,40 కాబట్టి నా సహోదరులారా(అందరిని), ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.
- 1కొరింథీ 14:33 ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.
క్రమశిక్షణలో భాగమే కొందరు మౌనముగా నుండుటకు ఉపదేశింపబడిరి.
- 1కొరింథీ 14:27,28 ౼ భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.
- 1కొరింథీ 14:30 ౼ అయితే కూర్చున్న మరియొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.
1. పైన వాన్నియు జరుగుట లేదు గనుక పౌలు భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను అని, కూర్చున్న మరియొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. అని సూచనలు ఇస్తున్నాడు..
2. పురుషులను మౌనముగా ఉండమన్నాడు, పురుషులు మౌనముగా ఉండమని 2 సార్లు చెప్పబడితే అది కంటికి కనపడదు కాదు స్త్రీలు మౌనముగా ఉండమని ఒక సారి చెబితే అది మాత్రమే కనపడుతుంది.
35వ స్త్రీలు మాట్లాడకూడదు అని ధర్మశాస్త్రమును చెప్పుచున్నదా?
స్త్రీలు మౌనముగా ఉండవలేనని ధర్మశాస్త్రములో ఎక్కడుంది? మోషే చెప్పాడా లేక ప్రవక్తలు చెప్పారా? ఎక్కడ ఆ మాట లేదు.. లేనప్పుడు ఎందుకు ధర్మశాస్త్రము చెప్పుచున్నది అని అన్నాడు?
యూదులకు MISHNAH అనే సాంప్రదాయ సాంస్కృతిక ధర్మశాస్త్రం ఒకటి ఉంది అందులో వాళ్ళ సంస్కృతి సంప్రదాయలు జీవన విధానము గూర్చి ఉంటుంది. Mishnah berurah – vol 9:3B ఈ మాట ఉంది.
గమనిక :
దేవుడు తన వాక్యాన్ని నేరుగా ఇచ్చి ఇదే ఇక మీరు చెయ్యాలి అని చెప్పేలేదు, వాళ్ళ సంస్కృతి మధ్యలో దీపంలాగా తన ధర్మశాస్త్రాని పెట్టాడు. ఉదాహరణకు : దేవుడు – నా బాషా హెబ్రీ బాషా కాబట్టి అందరూ హెబ్రీనే మాట్లాడాలి అంటే కుదురుతుందా? సున్నతి అందరూ చేయించుకోవాలి అంటే అది కుదురుతుందా? కాబట్టి దేవుడు నేడు తన వాక్కును భిన్న సంస్కృతిలు ఉన్న ఈ ప్రపంచంలో దీపము వలె ఉంచాడు..
అలానే ఇజ్రాయెల్ వారికి ఈ mishnah అనే చట్టం ఒకటి ఉంది అందులో స్త్రీలు మౌనముగా ఉండాలి అని రాసి ఉంది..
1కొరింథీ 14:35 ౼ “వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను;”
- భర్తలు లేకపోతే? పెళ్లి కానివారు ఉంటారు వాళ్లకు భర్త ఉండదు వాళ్లు ఎవరిని అడగాలి? ఒంటరి మహిళలు పరిస్థితి? వీళ్ళు పక్కంటి భర్తలను అడిగి నేర్చుకోవలనా అర్ధం?? ఏమిటిది??
- ఇదే పత్రికలో ముందే భార్య భర్తల గురించి చెప్పాడు 1కోరింది 7వ అధ్యాయం 14:35లో వాళ్లకు సంబంధించినది.
1కొరింథీ 14:36 “దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా?”
ఇంగ్లీష్ బైబిల్ లో “ఏంటి?” అంటు start అవుతుంది వాక్యము ౼ What? was it from you that the word of God went out? or did it only come in to you? అంటే 34,35 వచనములు ఎవరో అంటే దానికి counter సమాధానంగా పౌలు చెప్తున్నాడు. “ఏంటి? దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా?” కాబట్టి 34,35 వచనములు పౌలు మాటలు కావు అనేది తెలిసిపోయింది, అక్కడ వారి మాటలకు 36 వచనము counter సమాధానంగా ఉంది. 1కొరింథీ 14:37,38 ౼ ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధిననియైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను. ఎవడైనను తెలియనివాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము(అనేక ప్రాచీన ప్రతులలో-వాడు తెలియబడిన వాడు కాడు అని పాఠాంతరము).
ముగింపు
గలతీయులకు 3:27,28 ౼ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
స్త్రీలను ఆ సంఘ పరిస్థితులను, వాతావరణమును బట్టి Allowed చేయవచ్చు. (కొన్ని ప్రాంతములలో పరిస్థితులు సరిగా ఉండకపోవొచ్చు ఎలాగునంటే సంఘములో కొందరి కామపు దృష్టిరిత్యా స్త్రీలను మౌనముగా ఉంచవచ్చు గాని ఆ మౌననికి 1కోరింది 14 అధ్యాయం కారణం కాదు అనేది గ్రహించాలి).
- స్త్రీలు సంఘములో వాక్యము చదవవచ్చు.
- ప్రార్ధన చేయవచ్చు.
- లేచి పాటలు పాడవచ్చు.
- Business meetings లో వారు తమ అభిప్రాయాలను తెలపనువచ్చు.
అంతేగాని స్త్రీతో నీవు సంఘములో వాక్యము చదవకు, ప్రార్ధన చేయకు, లేచి పాటలు పాడకు అని అనడం, అలా స్త్రీల విషయములో నీవు చూపు కఠిన వివక్ష దేవునికి మహిమకరము కాదు. స్త్రీలు అలా చేస్తే అది వారికి పాపమా? దయతో ఆలోచన చేయండి, అవసరాన్ని బట్టి వారికి అవకాశం కల్పించండి.
No comments:
Post a Comment