ఆత్మ శరీరములో ఎక్కడ ఉంది?

చాలా మంది సందేహం ఇది, ఆత్మ ముక్కులో ఉంటుంది అని కొందరైతే, ఆత్మ లోపల ఉంటుంది అనేది మరి కొందరు, వాక్యము వెలుగులో ఆత్మ అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది అనేది ఆలోచన చేద్దాం..

బైబిల్ నందు ఆత్మ అనే పదానికి గల తర్జుమాలు ఏమిటి?

  1. హెబ్రీలో ఆత్మ యొక్క మూలపదం = Ruach(రూ-ఆహ్‌)
  2. గ్రీకులో ఆత్మ యొక్క మూలపదం = pneuma(న్యూమా)
Reach(H7307) అనే హీబ్రు పదము పాత నిబంధనలో ఎలా తర్జుమా చేయబడినదో చూద్దాం :
  • ఊపిరి అని :౼ యోబు 15:30; 19:17; విలాప 4:20;
  • గాలి/వాయువు అని :౼ యోబు 16:3; యిర్మీయా 5:13; ఆది 8:1; సంఖ్య 11:31; 1రాజులు 18:45
  • శ్వాస/ఊపిరి అని :౼ హాబక్కుకు 2:19; యోబు 4:15,34:14 కీర్తన 104:29-30; కీర్తన 33:6
  • మనస్సు అని :౼ సంఖ్య 14:24 [రోమా 11:34🔛యెషయా 40:13]
  • దేవుడు మరియు దేవదూతలను అని :౼ 1రాజులు 22:21; యోహాను 4:24
  • మహిమ అని :౼ కీర్తన 16:9
Pneuma(G4151) అనే గ్రీకు పదము క్రొత్త నిబంధనలో ఎలా ఎలా తర్జుమా చేయబడినదో చూద్దాం :
  • గాలి/వాయువు అని :౼ యోహాను 3:8; హెబ్రి 1:7;
  • జీవము అని :౼ లుకా 8:55
  • శ్వాస/ఊపిరి అని :౼ 1థెస్స 2:8; ప్రకటన 11:11
  • శక్తి అని :౼ లుకా 1:35
  • దెయ్యము
అంటే ఆత్మ అనే పదానికి ఒక నిర్దిష్టమైన అర్ధం/భావం/తర్జుమా లేదని, దానిని సందర్భనుసహితముగా “ఆత్మ” అంటే ఏమిటో అర్థం చేసుకోవాలని అర్ధం అవుతుంది.

ఆత్మ నరునిలోఎక్కడ ఉంటుందో ఆలోచన చేద్దాం :

నేడు క్రైస్తవులలో అధిక శాతం మంది ఆత్మ అంటే శరీరం లోపల ఉండే మరో నరుడు అని అందురు అంటే ఆత్మను శరీరమును వేరు వేరుగా చూస్తారు.
మానవ నిర్మాణము
ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
  1. నరుడు నేల మంటితో నిర్మించబడ్డాడు
  2. వాని నాసిక రంద్రములలో దేవుడు జీవ వాయువు ఊదగా
  3. నరుడు జీవాత్మ ఆయెను..
దేవుడు నరునిలో జీవ వాయువును ఊదాడుగాని, ఆత్మ అనే వేరొక పురుషుని శరీరములో పెట్టలేదు అది గ్రహించాలి.. ఆ నోటి ఊపిరి చేత నరుడు జీవాత్మ అయ్యాడు అంటే జీవించే ప్రాణి అయ్యాడు(1కోరింది 15:45).
జీవించే ప్రాణానికి ఏది అవసరం? రక్తము అని బైబిల్ చెప్తుంది. “ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివసించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినయెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము; దానిరక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణా ధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.”(లేవీ 17:13,14).
ప్రాణానికి రక్తము ఎలా ఆధారమో, ఆత్మకు మెదడు అంత ఆధారము. రక్తము లేకపోతే ప్రాణము లేదు, మెదడు లేకపోతే ఎలాంటి ఆలోచన ఉండదు.. నువ్వు మంచిగా ఆలోచన చెయ్యాలన్న లేదా చెడ్డగా ఆలోచన చెయ్యాలన్న కేవలం మెదడు మాత్రమే ఆ ఆలోచనకు ఆధారము, ప్రతి విధమైన ఆలోచనకు, కోరికలకు, నిర్ణయాలకు కేవలం మెదడు మాత్రమే ఆధారము. మెదడును గూర్చి మరింత సమాచారం కోసం ఈ క్రింద లింక్ open చేయండి..
  1. https://te.vikaspedia.in/health/c06c2fc41c30c3ec30c4bc17c4dc2fc3ec32c41/c2ec46c26c21c41-c15c4ac28c4dc28c3f-c06c38c15c4dc24c3fc15c30-c35c3fc37c2fc3ec32c41#section-2
  2. https://mayfieldclinic.com/pe-anatbrain.htm
మెదడు(brain) అనేది అంత important అని మనకు తెలుసు. కానీ విచిత్రమేమిటంటే బైబిల్ లో కానీ అపొక్రిపా రచనలలో కానీ BRAIN అనే పదం ఉండదు, ఎందుకంటే 16 శతాబ్దంలో(1669) ఈ పదం బయటకు వచ్చింది, అంతవరకు ఎవరికి మెదడు అనేది ఒకటి ఉందని దాని వలన ఇన్ని జరుగుతున్నవన్నీ తెలియదు. అందుకే దావీదు అంటాడు. ౼ “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము (కీర్తనలు 103:1)“. అంతరంగము ఎలా స్తుతిస్తుంది? కిడ్నీలు, గుండె, జీర్ణశయం, ఎముకలు ఇవి దేవుని స్తుతిస్తాయా?? మెదడు లోని భావాలు తప్ప శరీరములో మరేదీ కూడా దేవుని స్తుతించలేదని అందరికి తెలుసు.
ఎపుడైనా accident కానీ, లేదా తలకు బలమైన గాయం కానీ అయితే అతడు తన పూర్వ జ్ఞాపకాలను మర్చిపోయి అవకాశం ఉంది, అంటే దేవుని గురించి, నువ్వు బైబిల్ నందు పాటించిన అంశాలు, పాడిన పాటలు, చెప్పే వాక్యము, చేసిన బలమైన ప్రార్ధనలు మర్చిపోయే అవకాశం ఉంటుంది, మరి ఆత్మ వేరే వ్యక్తి అయితే తాను ఏమి చేస్తాడు?
మధ్యం బాగా సేవించిన వ్యక్తిని చూడండి అతను ఏదేదో మాట్లాడతాడు లేదా ఏదేదో చేస్తాడు, తనకు లోపల ఉన్న వేరే ఆత్మ ఏమి చేస్తుంది?
ఇలాంటి ప్రశ్నలు ఎనో వస్తాయి కాబట్టి మెదడు ఆలోచనలకు కేంద్రము ఆ ఆలోచనలే ఆత్మ, పరిశుద్ధముగా ఆలోచన చేస్తే అది పరిశుద్ధాత్మ, దుర్మార్గమైనదైతే దురాత్మ, భ్రమపరిచేదిగా ఉంటే భ్రమపరచు ఆత్మ, అబద్దాలు ఆడేదిగా ఉంటే అబద్ధపు ఆత్మ.
1యోహాను 4:6 ౼ మనము దేవుని సంబంధులము; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొనుచున్నాము.
బైబిల్ లో దేవుని స్వభామును ఆత్మ అని, లోక స్వభావమును శరీరము అని పోల్చడం జరిగింది.

No comments:

Post a Comment