స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవాల్సినదేనా? (Part -3)

సంఘములో స్త్రీ యొక్క అధికారము?

ఇశ్రాయేలు సమాజములో పురుష ఆధిక్యత అనేది ఉండేది దానికి గల కారణములు :
Male domination ౼ పురుష ఆధిక్యత అనేది ఇజ్రాయెల్ సంస్కృతిలో ఉండేది, దానికి కారణం ౼ స్త్రీలు చిన్న తనములోనే పెండ్లి చేసుకునేవారు 3,4 నెలల్లో గర్భవతులు అయ్యేవారు దాదాపు ఒక సంవత్సరం ఇంట్లోనే ఉండేవారు, పిల్లలు కనిన తరవాత మరల 3,4 నెలలకు పిల్లలను కనేవారు మరల సంవత్సరం ఇంట్లోనే ఉండేవారు ఎలా 4,5గురు పిల్లలను కనేవారు, ఋతు క్రమములో 7 దినముల పాటు కడగా ఉండవలెను(లేవి 15:19). మరియు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవి, ఇలా స్త్రీలు కనడం పిల్లలను పెంచడం, దేవుని సేవ continue గా పురుషుని వలె సేవ చేయడానికి స్త్రీకి అనుకూలంగా ఉండేది కాదు, దూర ప్రయణములు చేసి వాక్యం ప్రకటించుటకు ఒంటరిగా స్త్రీకి ప్రమాదం ఎందుకంటే అది కామాంధుల ప్రపంచం. ఇలాంటి వ్యవస్థ స్త్రీలకు ఏర్పడడం వలన పురుష ఆధిక్యత అనేది ఉండేది.. అందువలన మొదట అన్నియు పురుషునికి చెప్పినట్టే ఉంటుంది అది స్త్రీలకు కూడా వర్తిస్తుంది..

అధికారము విషయానికి వస్తే :

దేవుని గుడారములో సేవ చేయడానికి ప్రధాన యాజకులు ఉన్నారుగాని ప్రధాన యజకురాలు లేరు. కానీ తను తన భర్తతో కలసి వాక్యము చెప్పవచ్చును. "ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశద పరచిరి (అపో.కార్యములు 18:26 )". 
వారి పని : 1 తిమోతికి 5:14
కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని "గృహ పరిపాలన" జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. 

No comments:

Post a Comment