
ముందుమాట :
- దేవత్వము అనేది ఒక మనిషి కాదు.
- దేవత్వము అంటే దేవుడు కాదు.
- దేవత్వము శరీరము కాదు.
- దేవత్వము అంటే అది కేవలం ఒక “తత్వము” మాత్రమే అనేది గుర్తించాలి.
దేవత్వము అనగా యెహోవా తత్వము అని అర్ధం.
ఎందుకంటే యెహోవానే దేవుడు ఆ దేవత్వము కూడా యెహోవాదే ౼ రోమా 1:20 ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును,
అపోహ :
- క్రీస్తుకొక దేవత్వము, పరిశుద్త్మకొక దేవత్వము, యెహోవాకొక దేవత్వము అంటూ ఏది లేదు ఉన్నది ఒక్కటే దేవత్వము.
- “దేవత్వము కలిగినవాడు దేవుడు” అని బైబిల్ లో ఎక్కడ లేదు.
- ఒకే దేవత్వము తన తత్వాన్ని ముగ్గురిలో బయలుపరచుకుంటున్నది అనేది కూడా ఒక అపోహే..
దేవత్వము అనగానేమి?
దేవునిలో రెండు రకముల లక్షణములు కలవు,
- శక్తికి గల లక్షణములు
- వ్యక్తిత్వముకు గల లక్షణములు
దేవుని యొక్క వ్యక్తిత్వ స్వభావమే ౼ దేవత్వము.
theiotēs అనే పదానికి అర్ధం
ఈ గ్రీకు పదాన్ని :- “divine nature, divinity, godhead, deity, దేవత్వము, దైవత్వము” అని తర్జుమలు చేశారు, వీటన్నిటి భావము ఒక్కటే ౼ దేవుని తత్వము, దైవ స్వభావము అనే భావం వచ్చును.
దృఢ’త్వము, ఘన’త్వము, క్రూర’త్వము, మృదు’త్వము, మనవ’త్వము ఈ “త్వము” అనేది వాటి స్వభావాన్ని(nature)ని తెలియపరుస్తాయి..
చాలామంది ఈ దేవత్వము అని చెప్పుకుంటూ వారు త్రిత్వమును బోధిస్తు ఉంటారు. ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి త్రిత్వం దేవత్వము ఒక్కటే అని అనిపిస్తుంది. ఇదే తప్పుడు సిద్ధాంతం.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
దేవత్వము క్రొత్త నిబంధనలో 3 సార్లు కనపడుతుంది
- అపో.కార్యములు 17:29: కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను “దేవత్వమును” పోలి యున్నదని తలంపకూడదు.
- రోమీయులకు 1:20: ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు “దేవత్వమును“, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.
- కొలస్సీయులకు 2:9: ఏలయనగా “దేవత్వము” యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;
దేవత్వము యొక్క ఉనికి ఎక్కడ?
రోమా 1.20 చదువుము
ఆయన(యెహోవా) అదృశ్యా గుణలక్షణములు :
- నిత్యశక్తి
- “దేవత్వము“
మొదట ఈ దేవత్వము(Divine nature) అనేది యెహోవాతండ్రి యొక్క అదృశ్య లక్షణము అనేది గ్రహించాలి. రోమా 1.20 లో ఉన్న “ఆయన అదృశ్య లక్షణములు” అనే దానిలో “ఆయన” అనేది యేసుక్రీస్తు కాదు, పరిశుద్త్మ కాదుగాని యెహోవాతండ్రినే ఉద్దేశించి రచయిత ఆయన లక్షణములు అని చెప్పాడు..
దేవత్వము యొక్క ఉనికిని కేవలం తండ్రిలోనే చూడగలము అది ఆయన అదృశ్య లక్షణము తండ్రి లక్షణములను ప్రతిబింబించింది యేసుక్రీస్తు.
దేవత్వము యొక్క స్వభావము
- “పరిశుద్ధుడు” – పాపము లేనివాడు ౼ లేవి 19:2; 1పేతురు 1:14.
- “నీతిమంతుడు” – పాపము చేయలేనివాడు ౼ కీర్తనలు 18:30; యోహాను 17:25
- “ప్రేమా స్వరూపి” – దేవుడు మనకు సమస్థాన్ని ఇచ్చాడు ౼ 1యోహాను 4:8,16
- “సత్యవంతుడు” – అబద్దమాడనేరని వాడు. ౼ సంఖ్యా 23:19; తీతు 1:2..
- “నమ్మదగినవాడు” ౼ ద్వితీయోప 7:9; 1కొరింది 1:9
- “మంచివాడు” – సత్పురుషుడు, ఉత్తముడు. ౼ కీర్తన 34:8; నహుమ 1:7; మత్తయి 19:17;20:15.
- “పరిపూర్ణుడు” – స్వభావములోను, వ్యక్తిత్వములోనూ పరిపూర్ణుడు (ఏ కొదువ,లోపము లేనివాడు) ౼ కీర్తన 18:25; 19:7-11; మత్తయి 5:48.
- “కనికరము, దయ, దీర్ఘశాంతము” గలవాడు ౼ నిర్గమ 34:6.
ఇవి కంటికి కనిపించే లక్షణములు కావు, చర్యల ద్వారా తెలుసుకోవడమే ఎలాగునంటే ౼
- యోహాను 14:7-11 మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.
- యోహాను 12:45-50 నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.
యెహోవాతండ్రి యొక్క వ్యకిత్వ స్వభావాన్ని ఎవరెవరు కలిగియున్నారు?
- దేవుని చేత పంపబడిన క్రీస్తు(శిరస్సు) కలిగియున్నాడు
- క్రీస్తు స్వరక్తమిచ్చిన తన సంఘము(శరీరము) కలిగియున్నది.
1) దేవుని చేత పంపబడిన క్రీస్తు(శిరస్సు) కలిగియున్నాడు.
గలతియులకు 3:27: క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. మనము క్రీస్తును ఎలాగూ ధరించుకొన్నామో అలాగునే క్రీస్తు దేవత్వమును ధరించుకొనియున్నాడు.
అపోహ :
పరలోకములోనే యేసుక్రీస్తు దేవత్వము గలవాడు అనేది త్రిత్వ/దేవత్వ వాదుల విశ్వాసం ఈ విశ్వాసనికి ఎలాంటి ఆధారము ఉండదు. ఆయన మరియ గర్భం నుండి జన్మించిన మొదలు దేవత్వమునందు ఎదుగుతూ సంపూర్ణత సాధించి సేవ ప్రారంభించాడు..
★ యేసు ఎలాగూ దేవత్వమును సంతరించుకున్నాడో చూద్దాం :
- లూకా 2:52: యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.
- యోహాను సువార్త 5:19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.“
- యోహాను 8:28: కావున యేసుమీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, “తండ్రి నాకు నేర్పినట్టు” ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.
- యోహాను సువార్త 14:9-10 యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? “నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు.“
యేసుక్రీస్తు పుట్టుకతో దేవత్వము కలిగినవాడు కాదు పుట్టుక నుండి దేవత్వమందు ఎదిగినవాడు. క్రీస్తు యొక్క ఆలోచనలో, పనులలో, నడకలో సమస్త విషయములలో తండ్రిని పోలి నడిచి దేవత్వమును చూపెట్టాడు.
పునరుద్దనము తరువాత ఆయన పొలికను గూర్చి హెబ్రీ రచయిత ఇలా అన్నాడు ౼
- హెబ్రీయులకు 1:3-4 ౼ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును (లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, [3]who being the brightness of His glory and the “express image of His person”,
2) క్రీస్తు స్వరక్తమిచ్చిన తన సంఘము(శరీరము) కలిగియున్నది.
కొలస్సీయులకు 2:9: ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;
★ శరీరముగా అంటే సంఘముగా :
కొలసియులకు శరీరము అంటే గ్రంధాకర్త ఏమి చెప్తున్నాడో చూద్దాము.
- కొలస్సీయులకు 1:18: సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.
- కొలస్సీయులకు 1:24: ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.
- కొలస్సీయులకు 2:9: ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;
- కొలొస్సయులకు 2:19 శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది.
- కొలస్సీయులకు 3:15: క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.
★ నివసించుచున్నది అనగా?
నివసించినది –
జరిగిపోయినది
నివసించుచున్నది –
still నేటికి ఉన్నది
నివసించబోతున్నది –
జరగబోతున్నాది
“శరీరముగా నివసించుచున్నది” అనేది క్రీస్తు యొక్క భౌతిక శరీరమే అని అనుకుంటే ౼ మరియ గర్భముకు మునుపు ఏసుకు శరీరము లేదు కాబట్టి దేవత్వము లేదనేగా అర్ధం.
యేసు మరియు అపోస్తులుల బోదల ద్వారా క్రొత్తనిబంధన సంఘములో దేవుని తత్వము నివసించుచునది వాక్యము ద్వారా దానిలో ఎడగాల్సిన అవసరం ఉంది.
దేవుడు సంకల్పంలో మనము తనకు కుమారులుగా ఉండాలని నిర్ణయించుకొనెను (ఎపిసి 1:3-10) తన కుమారులు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలో ఎలాంటి లక్షణములతో ఎదగాలో సంకల్పించిన దేవుడు మన కొరకు క్రీస్తును పంపి ఆయనను మనకు మాదిరిగా/మార్గదర్శిగా తన తత్వాన్ని దేవుడు క్రీస్తు ద్వారా మనకు అర్ధం అవ్వాలని కనపరచాడు…
★ క్రీస్తు తన పొలికలో ఎదిగినట్టు మనము కూడా తన పొలికగా ఎదగాలని దేవుడు కోరుచున్నాడు.
- మత్తయి 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
- లూకా 6:36: కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి.
- ఎఫెసీయులకు 4:24: నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
- ఎఫెసీయులకు 5:1: కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.
- 1యోహాను 3:2: ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము.
దేవత్వము యొక్క సంపూర్ణతకు మనం ఎదగవసిన అవసరం ఉంది. ఎందుకంటే క్రీస్తు దేవుని స్వరూపి ఎఫెసీ 4:12: అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
- 2 పేతురు 1:4 ౼ ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, “దైవ స్వభావమానునందు” పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.
- ఎఫెసీయులకు 4:24: నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
- యోహాను 10:35: లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడలనేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
ముగింపు :
- క్రీస్తు దేవత్వము, పరిశుద్త్మ దేవత్వము, యెహోవా దేవత్వము అని ఇన్ని రకముల దేవత్వములు బైబిల్ లో లేవు ఉన్నది ఒక్కటే దేవత్వము అది కూడా యెహోవాతండ్రి యొక్క వ్యక్తిత్వ లక్షణము దానిని క్రీస్తు మనకు చూపెట్టి మాదిరిగా ఉంచిపోయెను.
- దేవత్వము క్రీస్తు కలిగియునట్టే నువ్వు నేను కూడా కలిగియుండలి అనేదే దేవుని సంకల్పము.
- దేవత్వము మనుషులకు ఉండదు అనేది సాతాను బోధ.
- మనవత్వమునకు మించినది దేవత్వము.
No comments:
Post a Comment