
ముందుమాట :
- యేసుక్రీస్తు సృష్టికి మునుపు పరలోకములో ఒక వ్యక్తిగా కానీ లేక ఆత్మగా కానీ లేడు.
- సృష్టికి మునుపు మహాదేవునితో మహా దేవునివలె ఉన్నాడు తగ్గించుకుని మనవునిలా వచ్చాడు అని విశ్వసిస్తే నేడు మరో మహాదేవుని అధికారము కింద యేసుక్రీస్తు ప్రభువుగా పని చేయవలసిన అవసరమేమి?
ఇద్దరు మహా దేవుళ్లు ఉండేందుకు అవకాశం ఉందా? లేదు.
- దేవుని (యెహోవా) వంటి మహా దేవుడు ఎక్కడ ఉన్నాడు? – కీర్తనలు 77:13
ఎవరు ఆ మహా దేవుడు భక్తుల మాటలలో :
- వారిని చూచి జడియవద్దు; నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. –ద్వితీ 7:21
- ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. – ద్వితీ 10:17
- ఎజ్రా 5:8: రాజవైన తమకు తెలియవలసిన దేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితివిు, అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది;
- నెహెమ్యా 8:6: ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా
- కీర్తనలు 95:3 ౼ యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు
- దానియేలు 2:45 ౼ చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహా దేవుడు ముందు జరుగ బోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు;
పాత నిబంధన గ్రంథమందు భక్తుల మాటలలో మహా దేవుడు ఒక్కడే ఆయనే తండ్రినయెహోవా.
క్రొత్త నిబంధనలో ఉన్న క్రొత్త సమస్య :
తీతుకు 2:9-14 ౼ దాసులైనవారు అన్ని విషయముల యందు “మన రక్షకుడగు దేవుని” ఉపదేశమును అలంకరించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, “అనగా మహాదేవుడును మన రక్షకుడునైన” “యేసుక్రీస్తు మహిమయొక్క” ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
అర్ధం చేసుకోవాల్సిన విధానము :
- 9వచనమును 13వ వచనముతో సరి చూచుట :
- మహా దేవుడును మన రక్షకుడు అనేది తండ్రినే, యేసుక్రీస్తు మహిమ అనగా తండ్రి మహిమ.
- 9వ వచనంలో, తండ్రైన దేవుడు “మన రక్షకుడిగా” గుర్తించబడ్డాడు. 13 వ వచనంలో పౌలు చెప్పినదానిని గమనించండి. “మహా దేవుడును మన రక్షకునిదైన (యెహోవదైన) యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత” కొరకు ఎదురుచూచుచు, అని చెప్పబడినది.
- అంతేకాని మహాదేవుడు మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నామని వాక్యము చెప్పలేదు.
- మన మహా దేవుడు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క “మహిమ” కోసం మేము ఎదురు చూస్తున్నామని వాక్యభాగం సెలవిస్తోంది. యేసు అంటే అదే – మన మహాదేవుడు మరియు రక్షకుడి మహిమ, తండ్రి మహిమ అని అర్ధం….
అర్ధం చేసుకోవడం కోసం :
- మహాదేవుడును మన రక్షకునిదైన = యెహోవాదైన
- యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత
యెహోవాదైన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత
మహిమ :
- తండ్రి యొక్క మహిమ :
- మత్తయి 16:27: మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.
- లూకా 9:26: నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.
- యోహాను 11:40: అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;
13waiting for the blessed hope and manifestation of the glory of our great God and Saviour Jesus Christ ౼ (YLT)
13looking for the blessed hope and the appearing of the glory of our great God and Savior, Christ Jesus ౼ (NASB)
13Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ ౼ (KJV)
- పై వచనములో “Our great god” అని చాలా తర్జుమలలో ఉన్నవి అలాగని ఈ త్రిత్వ/దేవత్వ వాదులు యేసు నాకు/మనకు మహా దేవుడా? అని అడిగితే పైగా వారి సమాధానం ౼ నాకు/మనకు దేవుడు కాదు మహాదేవుడు అంతకంటే కాదు అనేస్తారు. ఇదేం చిక్కుముడో మీరేే అర్థం చేసుకోవాలి.
No comments:
Post a Comment