సృష్టికర్త ఎవరు?

ప్రసంగి 12:2 తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే “నీ సృష్టికర్తను” స్మరణకు తెచ్చుకొనుము.
బాషా పదము యొక్క అర్ధము :
  • గ్రీకు ౼ ktistés (G2939 a creator)
  • హెబ్రీ ౼ bârâ (H1254 A primitive root; (absolutely) to create )
  • English ౼ creator
  • తెలుగు ౼ సృష్టికర్త
సృష్టికర్త అని బైబిల్ నందు 14 సార్లు ఉన్నది. బైబిల్ నందు ఎక్కడ కూడా సృష్టికర్తలు అనే బహువచనము లేదు, కేవలం సృష్టికర్త అనే ఏకవచనము మాత్రమే ఉంది.
సృజింపబడిన వస్తువును దానిని సృజించినవాడు సృష్టికర్త అవుతాడు.
యేసుక్రీస్తు దేనికి(ఏ వస్తువుకు) సృష్టికర్త? తన సొంత అధికారముతో దేనిని సృజించాడు ఆలోచన చేయవలెను…
యెహోవానే సృష్టికర్త అని గ్రంధం చాలా తేటగా చెప్తుంది. కానీ ముగ్గురు సృష్టికర్తలు ఉన్నారు అని గ్రంధం ఎక్కడ చెప్పలేదు.
  • సంకల్పము యెహోవాదే
  • బిడ్డలు కావాలనే కోరిక యెహోవాదే
  • భౌతిక సృష్టి, బిడ్డల కోసం ఏర్పాటు చేసింది యెహోవానే
  • తన బిడ్డలు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఆజ్ఞ ఇచ్చింది యెహోవానే.
  • ఏ కోణములో చూసిన యెహోవానే సృష్టికర్త.

యెహోవా సంకల్పంలో భౌతిక సృష్టి ఉద్దేశ్యము

1కొరింథీ 15:46 ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మ సంబంధమైనది.
సంకల్పములో భౌతిక సృష్టి చేయాలనే ఆలోచన దేవునిది(యెహోవాది) మాత్రమే ఎవరి ప్రమేయము లేదు. “ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?(రోమా 11:34)”
దేవుడు సంకల్పించిన రెండు సంగతులు:-
  1. తనకు కుమారులు కావాలని తన కోసం నిర్ణయించుకొనుట.
  2. దేవునికి కుమారుడగు క్రీస్తు ఆ కుమారులలో జేస్తుడగుట.(రోమా 8:28,29)
ఎపిసి 1:3-12 వచనములు తనలో తాను నిర్ణయించుకొనిన సంగతులను తెలియచేయును.
  • దేవుని సంకల్పము నెరవేరలంటే మనుషులు కావాలి.
  • ఆ మనుషులు బ్రతకాలంటే వారికొఱకు వారికి భౌతిక సృష్టి కావాలి.
  • దేవుని కోసము మనుషులు, మనుషుల కోసము భౌతిక సృష్టి రెంటినీ దేవుడే(యెహోవాయే) చేసాడు.
మనుషుల కొరకు భౌతిక సృష్టి అందలి సమస్తమును దేవుడే(యెహోవానేే) చేసాడు. – ఆది 1:1-31.
  • యెషయా 42:5 – ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
  • యెషయా 48:13 నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.
  • యెషయా 44:24 – గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను
  • యెషయా 45:11-12 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.
  • కీర్తనల 8:3-4 నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
  • కీర్తన 102:25 – ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే.
  • కీర్తనల 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
  • జెకర్యా 12:1 దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా
  • సామెతలు 8:29 జలములు తమ సరిహద్దులు మీరకుండు నట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు
  • నిర్గమకాండము 20:11 – ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
  • యెషయా 64:8 యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

సమస్తము ఎలాగూ చేసాడు?

అవాస్తములు :
యెహోవా ౼ నువ్వు సృష్టి చేయి అని చెప్తే యేసు పరిశుద్త్మతో ఏది ఎలా చేయాలో, ఏది ఎక్కడ చేయాలో క్రీస్తు ఇంజనీర్ గా ఉంటూ పరిశుద్త్మతో చేయించడంట అందువలన ముగ్గురు సృష్టికర్తలు ఉన్నారు అనే ఒక అవాస్తవం నేడు చాలా మంది విశ్వాసులలో చూడగలం.
అలా లెక్కలో చూసుకున్న సృష్టికర్త ఒక్కడే అవుతాడు మిగతా ఇద్దరు పని వారు అవుతారు. ఉదా: తాజ్మహల్ కూలీలు కట్టారు అని వారిని సృష్టికర్తలు అనలేము కదా! ఇది అంతే..
యెహోవా సమస్తమును తన వాక్కు చేత సృజించేను :
“వాక్కు = మాటపలుకుఆజ్ఞసందేశం
  • ఆదికాండము 1:3 – దేవుడు వెలుగు కమ్మని “పలుకగా” వెలుగు కలిగెను.
  • కీర్తనల 33:6,9 – యెహోవా “వాక్కు చేత” ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. 9. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.
  • హెబ్రీయులకు 11:3 ప్రపంచములు దేవుని “వాక్యము వలన” నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింప బడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.
  • కీర్తనల గ్రంథము 147:18,19 – ఆయన “ఆజ్ఞ ఇయ్యగా” అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును, 19. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను.
  • యెషయా గ్రంథము 45:12 – భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను “ఆజ్ఞ ఇచ్చితిని“.
  • 2పేతురు 3:5 ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు “దేవుని వాక్యమువలన కలిగెననియు” వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
  • యాకోబు 1:18 – ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు “సత్యవాక్యమువలన మనలను తనసంకల్ప ప్రకారము కనెను“.
కొందరిభక్తుల సాక్షము ద్వారా సృష్టికర్త ఎవరో చూద్దాం :
  • అబ్రాహాము మాటలలో – ఆది 14:23
  • ఇస్సాకు మాటలలో – ఆది 24:4
  • మోషే మాటలలో – కీర్తన 90:1-2
  • దావీదు మాటలలో – కీర్తన 8:3
  • ఆమోసు మాటలలో – ఆమోసు 9;6
  • యోబు మాటలలో – యోబు 26:7
  • యేసుక్రీస్తు మాటలలో – లుకా 10:21, మత్తయి 19:4, 11:25.
  • పౌల్ మాటలలో – అపో 14:15
  • యాకోబు మాటలలో – యాకోబు 1:18
  • 24గురు పెద్దల మాటలలో – ప్రకటన 4:11
  • యెహోవా తండ్రి మాటలలో – యెషయా 44:24
1 కొరింథీయులకు 8:6a ➔ ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన “నుండి” సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము.
  • ఆయన నుండి అని ఉంది కాని వారి నుండి అని లేదు గమనించండి..
1కోరింథీయులకు 11:12: స్త్రీ పురుషునినుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని “సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి.”.
  • సమస్తము దేవుని మూలముగా కలిగింది కానీ దేవుళ్ల మూలముగా కలగలేదు గమనించండి.
సృష్టికర్త ఒక్కడే ఆయనే తండ్రి సమస్తము ఆయన నుండి ఆయన వాక్కుచేత సృజించబడెను, ఆయన మూలముగా సంస్తమైనవి కలిగినవి.

అపార్ధము చేయబడిన వచనములు

  1. కొలసి 1:16: ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, “సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను”.
  2. యోహాను సువార్త 1:1-3 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. “సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
  3. హెబ్రీయులకు 1:10-12 మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.
  4. 1కోరింథీ 8:6 ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; “ఆయన ద్వారా సమస్తమును కలిగెను;” మనము ఆయనద్వారా కలిగినవారము.
ఈ వచనములలో ఎక్కడైనా యేసుక్రీస్తు సృష్టి తను చేసినట్టు ఉందా?? సరిగా ఒకసారి ఆలోచన చేయండి.. “కలిగెను, సృజింపబడెను” అని ఉంటే దాని అర్ధం తను చేశాడని బావమా?
సమస్తమును ఆయన మూలముగా కలిగెను అంటే ఎవరు కలిగించారు? ఇది ఆలోచన చేయాలి. ఈ క్రింది వచనము ద్వారా గ్రహించగలరు. హెబ్రీయులకు 1:1-2 పూర్వకాలమందు నానాసమయములలోను(మూలభాషలో-నానాభాగములుగాను) నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను(మూలభాషలో-యుగములను) నిర్మించెను
  • ఇక్కడ ప్రపంచములు ఎవరు నిర్మించారు? యేసుక్రీస్తు ద్వారా యెహోవా తండ్రినే నిర్మించాడు.
యేసుక్రీస్తు తను సృష్టి చేశాడని తను ఎక్కడ చెప్పలేదు, యేసుక్రీస్తు సృష్టి చేసిన ఒక్క ఆధారము కూడా బైబిల్ లో లేదు. పైగా యేసుక్రీస్తు విశ్వాసము ఏమిటంటే?
– “ఆయన సృజించినవాడు” అని చెప్తున్నాడు.. మత్తయి 19:4 “ఆయన(యెహోవాతండ్రి) సృజించిన వాడు” ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీని గాను సృజించెననియు. మార్కు 13:19: అవి శ్రమగల దినములు; “దేవుడు సృజించిన” సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు, ఇక ఎన్నడును కలుగబోదు.
యేసుక్రీస్తు ద్వారా ఆయనను బట్టి దేవుడు సమస్తమును సృజించాడు, ఎందుకంటే దేవుడు కోరుకొనిన పరిశుద్దతా, నిర్దోషత్వం క్రీస్తులో ఉన్నవి. క్రీస్తులాంటి కుమారులు కావలనేదే దేవుని సంకల్పము..
క్రీస్తు ద్వారా అనగా :
బైబిల్ class పేటమనుకోండి ౼ speakers, chairs, బోజనమలు, ఇవన్ని ఎవరిని బట్టి/ద్వారా కలిగాయి? రాబోయే ప్రసంగికుడి కోసమే కదా. అలానే దేవుడు రాబోవు క్రీస్తును బట్టి ఆయన సంఘము కోసము ఈ Erangelmants చేసాడు.

No comments:

Post a Comment