పిలిప్పి 2:1-11








ముందుమాట :
  •  పౌలు, యేసుక్రీస్తు యొక్క Biopic ని simple గా చెప్తూ అందులో క్రీస్తు తగింపును చూపుతున్నాడు. అంటే జరిగిపోయిన విషయాన్ని పౌలు చెప్తున్నాడు.
  • యేసును ఫిలిప్ 2-11 పౌలు, యేసు దేవుడు, దేవునితో సమనుడు అని చెప్పదలచుకున్నాడా? లేక ఆ సంగస్థులు క్రీస్తుయేసు కలిగిన సమాన మనస్సు మీరు కలిగి యుండడని చెప్పదలచడా?
  • విషయాన్ని సందర్భానుసారంగా ఆలోచన చేయలేతప్ప అందులోని పదాలను బట్టి అదే సందర్భం అని భావిస్తే బైబిల్ అర్ధం కాదు.
  • బైబిల్ లో ఈ పత్రికలు పౌలు సంఘానికి ఇస్తే ఆ సంఘము పౌలు పత్రికను నకలు(duplicate) రాసి వేసే సంఘానికి ఇచ్చేవారు, ఈ ప్రాంతానికి వేరే ప్రాంతానికి భాష తేడాలు చాలా ఉన్నాయి, ఇలాంటి నకలు 3000 పైనే ఉన్నాయి, చాలా అక్షర దోషాలు "లో" "తో" ఇలాంటివి చాలా ఉన్నాయి అందుకే పదాలను బట్టికాక సందర్భాన్ని బట్టే ఆలోచన చేయాలి.

రచయిత ఎవరు? 

ఫిలిప్పీయులకు 1:1 ౼ పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.

రచయిత ఉద్దేశ్యం :

పిలిప్పి 2:5-11 లో పౌలు ఉద్దేశ్యం :
  1. 2:5 క్రీస్తు యేసుకు కలిగిన సమాన మనసు కలిగియుండుట.
  2. 2:6 దేవుని స్వరూపములో క్రీస్తు సమానత
  3. 2:7-8 ఆయన త్యాగం, విధేయత
  4. 2:9-11 ఆయన హెచ్చింపు.
పిలిప్పి 2:5-11 లో త్రిత్వవాదుల ఉద్దేశ్యం:
  1. యేసు దేవుని స్వరూపము కలిగిన దేవుడు
  2. సమస్త విషయాలలో సమానుడు
  3. ఆయన పరలోకమందు తగ్గించుకుని మనుషుల పొలికలో పుట్టాడు.
ఫిలిప్ 2వ అధ్యయములో పౌలు ఏమి చెప్పాలనుకున్నాడో దానిని సందర్భానుసారంగా అర్ధం చేసుకోవాలే కానీ పదాలను బట్టి అదే సందర్భం అనుకోవటం తప్పుడు భావానికి దారి తీస్తుంది.

వివరణ :

ఫిలిప్పి 2:5-11 లో ఉన్న సందర్భము భూమి మీదనే :
త్రిత్వ/దేవత్వ వాదులు ౼ యేసు తను తాను తగ్గించుకొని భూమి మీదకు వచ్చాడు అనేది.
బైబిల్ – యోహాను 8:42 నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.
తనంతట తానుగా రానివాడు, ఎలా తగ్గించుకొని వస్తాడు? ఒక వేళ త్రిత్వవాదుల అభిప్రాయములో వస్తే తండ్రే మరో దేవుడైన యేసును తగ్గించి పంపాలి. కాబట్టి ఇది భూమి మీద సంగతియేగాని పరలోకం నుండి యేసు వచ్చాడు అనే సందర్భము కానే కాదు..
2:5 క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
ఎందుకు పౌలు చెప్తున్నాడు ఈ మాట?
  1. అక్కడ ఏకత్వం లోపించింది,
  2. వారిని గూర్చి గాక, ఇతరుల గూర్చి కూడా ఆలోచించుట లేదని చెప్పబడినది.

ఫిలిప్పీ 2:1-4 కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను. 
క్రీస్తుయేసుకు కలిగిన మనసును ఎక్కడ చూస్తాం? భూమి మీదనే కదా! ఆ మనసు ఎలాంటిది అనేది ఈ క్రింది సమాచారమును చూద్దాం :
క్రీస్తుయేసునకు కలిగిన మనస్సు :
ఆయన దేవునితో సమానముగా ఉండుట అంటే Luxury(హోదా)గా ఉండాలని ఎప్పుడు అనుకోలేదు కానీ మనుషుల మాదిరిగా కనపడి, సేవకునిగా మారుటకు తన్ను తానే ఖాళీ చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు నరునిగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. “అందుచేత” ఆయన పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
గొప్పవాడైన క్రీస్తు తన గొప్పతనాన్ని గణింపక సామాన్యుని వలె తగ్గించుకొని విధేయత చూపడం. తద్వారా తండ్రి చేత హెచ్చింపబడుట.
2:6 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
క్రీస్తు దేవునిస్వరూపము పరలోకములోనే కలిగియున్నాడు అని తప్పుడు ప్రచారం ఉంది. పరలోకములోనే క్రీస్తు దేవుని పక్కన దేవుడు అని చెప్పే నీవు మరల దేవుని(యెహోవా) స్వరూపము కలిగియుండమేమిటి?..
గ్రంధం ఏమి చెప్పదలచిందంటే ఆయన భూమి మీదే దేవుని స్వరూపమును కలిగియున్నాడు. ఎలా?
  • "తండ్రికి ప్రతినిధిగా పంపబడ్డాడు(పుట్టింపబడ్డాడు), పంపబడిన ప్రతినిధిని చూస్తే పంపినవానిని చేసినట్టే"..
  • యోహాను 14:8,9 అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
  • యోహాను 14:10 తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయు చున్నాడు.
  • యోహాను 12:45 నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.
  • యోహాను 10:38 చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసి కొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను.
దేవుని స్వరూపము కలిగినవాడైయుండి దేవునితో సమానముగా ఉండుట గొప్పతనం, కానీ క్రీస్తు గొప్పగా ఎంచుకోలేదు. (రాజకుమారుడుగా పుట్టి, నేను రాజకుమారుడిని అని గొప్పగా ఎంచుకోలేదుగాని ఒక సాదారణ మనుషుల పొలికలో కనపడ్డాడు అని అర్ధం)
2:7 మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
  • గమనిక : పుట్టి అనే మాట తర్జుమా తప్పు., పుట్టి అనే మాట లేనేలేదు. అలా ఉండటం వలన పరలోకములోనుండి భూమి మీద శిశువుగా పుట్టాడు అని ఆ సందర్భమే మారిపోయే అవకాశం ఉంది. ౼  but made Himself of no reputation, and took upon Him the form of a servant, and was made in the likeness of men ౼ (NKJV) “అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు. బానిస రూపం(సేవకుడిగా) తీసుకున్నాడు. మానవుల పోలికలో(మాదిరిగా) కనిపించాడు.”
2:8 మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
  • యేసుక్రీస్తు ఆకారం చుస్తే ఒక సామాన్య నరుడిగా చూడటానికి శిస్యుల వలె కనిపిస్తు ఉన్నాడు, ఆయన వస్త్రధారణ ఆయన జీవనశైలి సాధారణముగా ఉన్నవి అని అర్ధము.. దేవునితో స్వరూపమందు సమనత కలిగిన యేసు చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే, తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు. అని వచన భావము..
2:9-10 అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,
  • అందుచేత ౼ సిలువ మరణముకైనా తనను తానే తగ్గించుకుని లోబడిన క్రీస్తును దేవుడు హెచ్చించిచాడు, ప్రతివాని మొకాలు యేసు నామమున వంగునట్లు అంటే ఆయన అధికారమునకు లోబడాలని అర్ధము.
2:11 ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
  • దేవుని(యెహోవా) మహిమ పరచబడాలనే ఉద్దేశ్యంతో యేసుక్రీస్తు, యెహోవా లాంటి దేవుడని ఒప్పుకోవాలని చెప్పక, ప్రభువని ఒప్పుకోవాలని ప్రతి అధికారమునకు పై అధికారమును దేవుడు అనుగ్రహించాడు అని, దేవుడు(యెహోవా) చెప్తునట్లు రచయిత చెప్తున్నాడు..

ముగింపు :

  • దేవుని స్వరూపము గలవాడు దేవుడు అని చెప్పడానికి ఏ ఆధారము ఉంది? అలా అనుకుంటే యెహోవా మరియు పరిశుద్త్మ కూడా దేవుని స్వరూపులే అని ఒప్పుకోవాలి, ఎందుకంటే ముగ్గురు సరిసమానులు అనే ఆలోచన కలిగి యున్నారు కనుక.
  • యేసు, యెహోవాతో సాటి దేవుడు అనే ఆలోచన గలవారు ౼ యేసు యెహోవా కోసము అంత త్యాగం చేస్తే చివరికి తన దేవుని స్థాయిని ఇవ్వక ప్రభువుగా నియమించడం దేనికి? ప్రభువు కంటే దేవుని స్థాయినే హెచ్చుకదా!.
సహృదయముతో సత్యాన్ని అంగీకరించండి, దేవునితో సమానుడు అంటే దేవుని స్థాయి అని అర్ధం కాదు, దేవుడు ఎలాంటి స్వభావ స్వరూపాన్ని కలిగియున్నాడో క్రీస్తు అదే స్వభావ స్వరూపమును కలియున్నాడు.

No comments:

Post a Comment