
యేసు దేవుడా? కదా? అన్న అన్న అంశంపై నేడు ఒక్క ముస్లిం, క్రైస్తవుల మధ్యే కాదు క్రైస్తవులు, క్రైస్తవుల మధ్య కూడా అనేక వాదోపవాదాలు జరుగుతున్న వైనాన్ని గమనించగలం. ఈ నేపథ్యంలో అసలు దృష్టిసారించాల్సిన అంశం ఏమిటంటే- యేసు దేవుడా? కదా? అన్న వాదన పాతదా? క్రొత్తదా? అన్నది.
ఒకవేళ ఈ వాదన పాతదే అనుకుంటే అంటే- యేసు ఉన్నప్పటి నుండి ప్రారంభమైన వాదన అనుకుంటే మొత్తం సువార్తల్లో మరియు పత్రికల్లో యూదులు-యేసుకు మధ్య, యూదులకు-యేసు శిష్యులకు మధ్య, యూదులకు-పౌలుకు మధ్య యేసు విషయంలో యేసు దేవుడా? కాదా? అన్న వాదన కచ్చితంగా జరిగి ఉండాలి కదా! మొత్తం సువార్తల్లో మరియు పత్రికల్లో యూదులు-యేసుకు మధ్య, యూదులకు-యేసు శిష్యులకు మధ్య, యూదులకు-పౌలుకు మధ్య యేసు విషయంలో అనేక వాదోపవాదాలు జరిగినట్టు చూడగలం కానీ, ఎక్కడా కూడా యేసు దేవుడా? కాదా? అన్న వాదన జరిగిన సందర్భాన్ని మత్తయి నుండి ప్రకటన గ్రంధం వరకు ఒక్కటంటే ఒక్క చోట కూడా మనం చూడలేము.
మరి ఆనాడు యూదులు-యేసుకు మధ్య, యూదులకు-యేసు శిష్యులకు మధ్య, యూదులకు-పౌలుకు మధ్య యేసు విషయంలో ఏ వాదన జరిగేది? అంటే యేసు మెస్సియా? కాదా? అన్న ఒక్క అంశం మీదే అనేక వాదోపవాదాలు జరిగినట్టు మనం చూడగలం. ఉదాహరహణకు యూదులకు-యేసుకు మధ్య ఏ విషయంలో వాదన జరుగుతూ ఉండేదో ఈ క్రింది వాక్యాన్ని చదివితే అర్థమౌతుంది.
“యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మును సందేహ పెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు మీతో చెప్పితిని గానీ మీరు నమ్మరు” – యోహాను 10:24-25
పై వాక్యాన్ని బట్టి యేసు అనేక సందర్భాల్లో ఆనాటి యూదులతో తన గురించి “మెస్సియ” అని నమ్మమని చెబుతూ ఉండేవారని అర్థమౌతుంది. యూదులు, యేసు విషయంలో సందేహానికి గురైన అంశం కూడా యేసు మెస్సియా? కదా? అన్నదే తప్పితే యేసు దేవుడా? కదా? అన్నది ఎంతమాత్రం కాదని కూడా స్పష్టమౌతుంది. అందుకే యూదులు, యేసు చుట్టూ పోగై – ” ఎంతకాలము మమ్మును సందేహ పెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమని” అడగటం జరిగింది. దానికి యేసు- ” మీతో చెప్పితిని గానీ మీరు నమ్మరు” అంటున్నారు. అంటే యేసు తన గురించి యూదులకు నమ్మించాలని చూసిన విషయం తాను మెస్సియ అన్నదే. యేసును అలా నమ్మటాన్నే యూదులు తిరస్కరించేవారు.
ఈనాటి త్రిత్వ/దైవత్వవాదుల ప్రకారం అయితే ఆనాడు యూదులు- “ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు దేవుడవైతే మాతో స్పష్టముగా చెప్పమని” అడిగి ఉండాలి దానికి యేసు కూడా – “నేను దేవుడని మీతో చెప్పాను గానీ మీరు నమ్మరు” అని చెప్పి ఉండాలి. కానీ యూదులకు, యేసుకు మధ్య అలాంటి వాదన ఎప్పుడూ జరగలేదు.
ఈ సందర్భంలో యేసు విషయంలో ఆయన వద్ద తర్ఫీదు పొందిన ఆయన శిష్యుల వాదన ఏమిటి అన్నది గమనిస్తే-
“ప్రతిదినము, దేవాలయములోనూ ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి” – అపోకా 5:42
పై వాక్యాన్ని బట్టి యేసు విషయంలో ఆనాడు యేసు శిష్యులకు ఆనాటి యూదులకు మధ్య వాదన ఆయన మెస్సియా? కాదా? అన్న విషయంలోనే జరుగుతూ ఉండేదని తెలుస్తుంది. అందుకే యేసు శిష్యులు ప్రతీ ఇంటికీ తిరిగి “యేసే దేవుడని” కాక, “యేసే మెస్సియ” అని అంగీకరించమని చెబుతూ తిరిగుతుండేవారని తెలుస్తుంది.
అలాగే పౌలు ఆనాడు యేసును తిరస్కరించిన యూదులతో యేసు విషయంలో అనేక చోట్ల తర్కిస్తూ ఉండేవాడని అతని పత్రికలు చదివితే తెలుసుకోగలం. ఇంతకూ పౌలు ఆనాటి యేసు తిరస్కారులైన యూదులతో యేసును ఏ విధంగా నమ్మమని తార్కిస్తూ ఉండేవాడో ఈ క్రింది వాక్యాలు చదివితే తెలుసుకోగలం.
“నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను నెత్తి విప్పి చెప్పుచూ వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను” – అపోకా 17:4
“సీలయు, తిమోతీయు మాసిదొనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై, యేసే క్రీస్తని యూదులకు ధృఢముగా సాక్ష్యామిచ్చుచుండెను” – అపోకా 18:5
“అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి – ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను” – అపోకా 9:22
“యేసే క్రీస్తయి యున్నాడని తర్కించుచుండెను” / “యేసే క్రీస్తని యూదులకు ధృఢముగా సాక్ష్యామిచ్చుచుండెను” / “ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు యూదులను కలవరపరచెను” అన్న వాక్యభాగాలను బట్టి ఆనాడు యూదులకు మరియు పౌలుకు మధ్య ఏ స్థాయిలో వాదోపవాదాలు జరుగుతూ ఉండేవో అర్థం అవుతుంది. అనేక చోట్ల పౌలు, యేసు తిరస్కారులైన యూదుల ముందు యేసును గురించి లేఖనాల్లో నుండి అనేక ఆధారాలు చూపించి, యేసును గురించి వారితో ఒప్పించాలని చూసిన విషయం – “యేసే క్రీస్తయి యున్నాడు” అన్నదే!
ఈనాటి యేసు దైవత్వ వాదుల ప్రకారం అయితే పై వాక్యాలు- “యేసే దేవుడై యున్నాడని తర్కించుచుండెను” / “యేసే దేవుడని యూదులకు ధృఢముగా సాక్ష్యామిచ్చుచుండెను” / “ఈయనే దేవుడని రుజువు పరచుచు యూదులను కలవరపరచెను” అని రాయబడి ఉండేవి.
ఈ విధంగా యేసు తన గురించి యూదులతో మెస్సియ (క్రీస్తు)గా నమ్మమని చెబుతూనే దేవునిగా ఒక్క యెహోవాను మాత్రమే నమ్మమని చెబుతూ ఉండేవారు.
“ఓ ఇశ్రాయేలూ మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు” … “ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొక దేవుడు లేదనియు నీవు (యేసు) చెప్పిన మాట సత్యమే” – మార్కు 12:29-32
అలాగే పౌలు సైతం యూదులతో “యేసును మెస్సియ(క్రీస్తు)గా” నమ్మమని చెబుతూనే “దేవునిగా ఒక్క యెహోవాను” మాత్రమే నమ్మమని చెబుతూ ఉండేవాడు.
“ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము” … “మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి” – 1 కోరిందీ 8:4-6
ఈ విధంగా బైబిల్ మొత్తం మనం చదివితే యూదులు-యేసుకు మధ్య, యూదులకు-యేసు శిష్యులకు మధ్య, యూదులకు-పౌలుకు మధ్య యేసు విషయంలో యేసు దేవుడా? కాదా? అన్న వాదన జరిగినట్టు ఎక్కడా చూడలేము. ఎందుకంటే అప్పటికే మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్న యూదులకు సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అన్నది స్పష్టత ఉంది. కానీ, వారు తిరస్కరించిన విషయం మటుకు యేసు మెస్సియగా అంగీకరించటాన్నే! అందుకే యేసు-
“దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి” – యోహాను 14:1
అంటూ యేసు ఆనాడు దేవుణ్ణి అంగీకరిస్తున్న యూదులతో నన్ను మెస్సియగా అంగీకరించమని చెబుతూ ఉండేవారని తెలుస్తుంది. చివరకు దేవునిని అద్వితీయునిగా అంగీకరించి, తనను “మెస్సియగా అంగీకరిస్తేనే నిత్యజీవం లభిస్తుంది” (యోహాను 17:3) అని కూడా షరతు పెట్టటం జరిగింది.
ఇక చరిత్రను పరిశీలించినా యేసు అనంతరం AD 325 లో రోమ్ లో జరిగిన కౌన్సిల్ ఆఫ్ నైషియా సభలోనే త్రిత్వ-అవతార వాదాలు ప్రవేశపెట్టబడ్డాయని, యేసు మరియు దేవుడు ఒకే సారం కలిగి ఉన్నారన్న వాదన ఆన్యుడైన “కాంస్టన్ టైన్ నోపుల్” ఆధ్వర్యంలో ఆమోదించబడిందని క్రైస్తవ చరిత్రకారులే చెబుతున్నారు. దీనిని బట్టి ఈనాడు యేసు దేవుడా? కదా? అంటూ జరుగుతున్న వాదన క్రొత్తదే తప్పితే పాతది ఎంతమాత్రం కాదని అర్ధమవుతుంది.
యేసు యూదులకు వాగ్దానం చేయబడిన రక్షకుడు. ఆయనను మేస్సియ గా అంగీకరించాలని తనకు తానుగా చెప్పుకుంటూ, తన శిష్యులకు, అపొస్థలులు సహితం అదే మాటను చెప్పాలని ఆజ్ఞాపించాడు యేసు క్రీస్తు.
ReplyDelete" తాను దేవుడని చెప్పుకోవాలని " మీకు కష్టం లేకుండా అవిశ్వాస విషయాలను యేసు బోధించు ఉండాలని గ్రంథ విరుద్ధ పద్ధతులను మీలాగా వాడమని ఏసుప్రభువును తప్పు పట్టడానికి ప్రయత్నాలు చేయాలని అనుకోవడం నిత్యపాపం
లేని విషయాలను "అలా ఉండాలి అని ఊహించుకోవడం", దాన్ని బట్టి ఏదో విషయాలు చెప్పడం గ్రంధ రీత్యా నేరం.
వివరణ కావాలంటే
నా నెంబరు : 9052402299