
ముందు మాట :
సృష్టికి పూర్వం విషయంలో యెహోవా, యేసు, పరిశుద్త్మ ముగ్గురి విషయములో 50% క్రైస్తవుల ఆలోచన ౼ ఈ ముగ్గురు కూడా దేవుడు అనే స్థాయి విషయములో ఏ మాత్రం తక్కువ గలవారు కాదని, సమానులని, ముగ్గురు ఒక లాంటి వారని, ముగ్గురు యెహోవాలుగా విశ్వసిస్తున్నారు.
ఒక దేవుడు మరో దేవునికి సేవకుడు అవ్వడం, ఒక దేవుడు మరో దేవునికి ప్రార్డన చేయడం, సర్వదికారము కలిగిన దేవుడు మరో దేవుని అధికారమును పొందటం, దేవుడు ప్రభువుగా తగ్గింపబడి ప్రభువుగా మరో దేవునితో నియమింపబడటం, ఒక దేవుడు మరో దేవునితో సొంత కుమారుడు అనడం ఇదంతా ఒక నాటకీయంగా గజిబిజి గజిబిజిగా ఉంటుంది. మనం ఆలోచన చేయవాల్సినది యేసుక్రీస్తు తండ్రి సంకల్పములో(తలంపులలో) క్రీస్తు ఉన్నాడా? లేక పరలోకములో మరో యెహోవాలగా మరో సింహాసనముపై యెహోవా వలె కూర్చున్నాడా? అనేది..
సత్యాన్ని పరిశీలన చేద్దాం :
యేసుక్రీస్తు తండ్రి చిత్తనుసరముగా ఆయన సంకల్పములో(తలంపులలో) నిర్ణయించబడి ప్రత్యేకంగా తండ్రి చేత భూమి మీదకు వచ్చినవాడు, పరలోకములో ఒక వ్యక్తిగా లేక ఆత్మగా ఉన్నట్టు ఎక్కడ లేదు అదేలాగునో ఆలోచన చేద్దాం…
సహజముగా పుట్టినవారు ఉన్నారు, పుట్టకమునుపే నిర్ణయింపబడి దేవుని చేత పంపబడిన వారు ఉన్నారు. పంపబడినవాని ఉనికిని నిర్ణయించేది దేవుడే ఎందుకంటే పంపేది దేవుడే కాబట్టి.
పుట్టకమునుపే నిర్ణయింపబడిన వారు
యాకోబు, ఏశావు వారి జీవితం ముందే తెలియజేయబడెను :
- Gen 25:21-25 “ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను.౹ ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగు లాడిరి గనుక ఆమె–ఈలాగైతే నేను బ్రదుకుట యెందు కని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను— రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిప్ఠమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.౹ మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి.౹”
యోషీయా :
- 1రాజులు 13:1-2 “అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవు నొంది యూదాదేశమునుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి యుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటనచేసెను–బలిపీఠమా బలి పీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా – దావీదు సంత తిలో యోషీయా అను నొక శిశువు పుట్టును ; నీమీద ధూపము వేసిన ఉన్నతస్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.౹”
కోరేషు :
- యెషయా 44:26-28 నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను –యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే. నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను కోరెషుతో–నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో–నీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పు చున్నాను.
- యెషయా 45:1-4 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. –నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని”
యిర్మీయా :
- యిర్మియా 1:5 గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.
సమ్సోను :
- న్యాయాధీ 13:3-5 యెహోవా దూత ఆస్త్రీకి ప్రత్యక్షమైఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను; అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారస మునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్ర మైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీ యులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనెను.
యోహాను :
- లూకా 1:13-16 అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్భ మున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.
యేసుక్రీస్తు :
- లూకా 1:30-33 దూత మరియా,భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.
తండ్రి సంకల్పములో (తలంపులలో) క్రీస్తు జీవన వృత్తంతం
యేసు పుట్టకమునుపే ఆయన జీవితాన్ని దేవుడు సంకల్పించాడు, ఆయన గొప్పవాడు అవుతాడని, సమస్తముని చక్కబరుస్తాడాని దేవుడు(యెహోవా) నిర్ణయించుకొనెను..
- 1పేతురు 1:20: ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను.
- కన్య గర్భమందు జన్మించుట
- యెషయా 7:14౼మత్తయి 1:18-25.
- ఆయన గొప్పవాడు అవుతాడు ౼ లుకా 1:32
- సర్వోన్నతుని కుమారుడు అవుతాడు ౼ లుకా 1:32
- తన తండ్రియిన దావీదు యొక్క సింహాసనసీనుడు అవుతాడు ౼ లుకా 1:32
- మెల్స్కిసేదెకు క్రమము చొప్పున నిరంతర యాజకుడు
- కీర్తన 110:4 ౼ హెబ్రీ 6:20.
- దేవునికి సేవకుడు అవుతాడు
- యెషయా 41:1 ౼ మత్తయి 12:18
- బేత్లెహేములో జన్మించుట
- మీకా 5:2౼మత్తయి 2:1-2.
- దావీదు వంశములో జన్మించుట :
- యిర్మీయా 23:5౼ప్రకటన 22:16.
- ముప్పై వెండి నాణెములకు :
- అమ్మబడుట జకార్య 11:12 ౼ మత్తయి 26:14-16
- తన స్నేహితులే అప్పగిస్తారు :
- కీర్తన 41:9 ౼ యోహాను 13:18-26
- వస్త్రము గూర్చి చీట్లు వేయుట :
- కీర్తన 22:18 ౼ మత్తయి 27:35.
- ఆయన ఎముకలలో ఒకటైనను విరిగిపోదు :
- కీర్తన 34:20 ౼ యోహాను 19:33-36.
- ధనవంతుని సమాధిలో క్రీస్తుయేసు పాతిపెట్టబడును. :
- యెషయా 53:9 ౼ మత్తయి 27:57-60.
- ఆయన బలి అవుతాడు ౼ ప్రకటన 13:8
- ఆయన శరీరము కుళ్ళి పట్టదు
- కీర్తన 16:8-11 ౼ అపో.కా 2:25-29.
- కీర్తన 22 అధ్య చూడుము..
- యెషయా 53 అధ్య చూడుము..
- లూకా 24:44: అంతట ఆయన – మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నేరవేరినవని వారితో చెప్పెను.
అపో.కార్యములు 3:18 అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను.
ఆయన జీవితమే దేవుడు నిర్ణయించాడు, (ఆయనకు ఏ పేరు పెట్టాలి, ఎలాగుండాలి, ఏమి మాట్లాడాలి, ఎలాంటి క్రియలు చేయాలి?) తగిన కాలమందు నిర్ణయించబడిన క్రీస్తును దేవుడు తను నిర్ణయించిన సంకల్పని బట్టి పుట్టించి ఇజ్రాయేల్ వద్దకు పంపెను. ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూసేది కూడా రానైయున్న క్రీస్తు కొరకే :
- లూకా 7:19 అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను.
- యోహాను 4:25,26 ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసునీతో మాటలాడు చున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.
దేవుడు పంపిన వారిలో క్రీస్తుకున్న గొప్పతనం ఏమిటి?
★ దేవుని సంకల్పము భవిష్యతులో రానైయున్న క్రీస్తుతో ముడిపడినది :
- అపో.కా 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.
- దేవుడు తనలో తాను ముందే క్రీస్తును నిర్ణయించుకున్నడు ౼ ఎపేసి 1:3-10 చూడుము.
★ తండ్రి తన అభిష్టము ప్రకారము సమస్తమును, సంకల్పములో ఉద్దేశించిన క్రీస్తును బట్టి పరమతండ్రి సృజించెను :
- హెబ్రీ 1:1-2 ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను.
- కొలసి 1:12-20 చూడుము..౼ ఆయనను బట్టి, ఆయన ద్వారా దేవుడు సమస్తమును చేసాడు.
- దేవుని తలంపులలో ఆయన అన్నింటికంటే ముందున్నవాడు.
- అనింటిలో క్రీస్తుకు ప్రముఖ్యము కలుగు నిమిత్తము, ఆయనను బట్టి కలిగెను.
- సమస్తము కలుగుటకు ఆధారభూతుడు.
ఉదాహరణకు : MLA గారితో ఒక చోట ముఖ్యమైన మీటింగ్ ప్రజల మధ్య ఉందనుకోండి, ఆ మీటింగులో మనకు కనపడే కుర్చీలు, ఫ్లిక్సీలు, పరిశుభ్రత, జనాలు, పంచాయితీ పెద్దలు, సెట్టింగ్, ఇవన్ని ఎవరిని బట్టి ఎవరి మూలంగా కలిగినవి? రానైయున్న MLA మూలంగానే కదా!
అలాగే రానైయున్న క్రీస్తును బట్టి/ద్వారా/మూలముగా భౌతిక సృష్టిని దేవుడు కలుగజేశాడు, హెబ్రీ 1:2 “ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.” కొలస్సీయులకు 1:16: ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.” అందుకే సమస్తము క్రీస్తుతో ముడిపడినది. క్రీస్తు తండ్రి సంకల్పములో అన్నిటికంటే ముందున్నవాడు(కొలసి 1:17).
అందుకే అందరికంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు.
అలా పంపబడిన క్రీస్తు తండ్రి అప్పగించిన పనిని తుద ముట్టించి అన్నిటి పైన అధికారము పొందియున్నాడు.
- 1పేతురు 3:22: ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.
- మత్తయి 28:18: అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.
- ఎఫెసీ 1:20-22 ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండ బెట్టుకొనియున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
- 1కోరింథీయులకు 15:27: దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడి యున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే.
(క్రీస్తు కూడా తండ్రివలె తన సర్వదికారము తను కలిగియునప్పుడు తండ్రి అధికారము క్రీస్తుకు దేనికి? ఏ అధికారము లేని వానికి అధికారము కావాలిగాని already అధికారము గలవనికి వేరే దేవుని అధికారం దేనికి?)
సంకల్పములో నుండి పంపబడినవాడు పంపినవానికంటే గొప్పవాడు కాదు
దేవుడు పంపితే వచ్చినవాడు యేసుక్రీస్తు. దేవుని చేత పంపబడినవాడు యేసుక్రీస్తు
- యోహాను 13:16b పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- యోహాను 13:28b తండ్రి నాకంటె గొప్పవాడు.
దేవుని కంటే యేసు గొప్పవాడు కాదు అనేది సత్యం. ఇక్కడే ఇరువురి హెచ్చుతగ్గులు అర్ధం అగుచున్నవి..
క్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి వేళ్తాడో ఆయనకు తెలుసు ఎందుకంటే తండ్రే నన్ను పంపెను అని గ్రహించెను కనుక
- యోహాను 8:14: యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.
- యోహాను 13:3: తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగి
పంపినవాడు పంపబడినవానికి కొలతలేకుండా ఆత్మను అనుగ్రహించెను కనుక పంపినవాని మాటలే పలుకును ౼ యోహాను 3:34
అందుచేత ఆయన యందు విశ్వసించుట నిత్యజీవము ౼ యోహాను 17:3.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
నేడు చాలామంది కొన్ని వచనములను బట్టి, అసలు concept మర్చిపోవలసివచ్చినది :
- హెబ్రీ 2:17 – కావాల్సివచ్చినది.
- 1 తిమోతి 3:16 – ప్రత్యక్షుడయెను.
- రోమా 8:34 ౼ లేచిన వాడును.
- ఫిలిప్ 2:8 తనను తాను తగించుకుని పరలోకము నుండి వచ్చాడు.
తనకు తానుగా చేయలేనివి :-
యేసుక్రీస్తు తనంత తను రాలేదు, తనకు తానుగా ప్రత్యక్షమగలేదు, తనకు తానుగా లేవలేదు, తనకు తానుగా ఏదియు చేయలేడు, తనంతట తాను ఏమియు మాట్లాడలేడు..
- యోహాను 8:42 నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.
- యోహాను 10:36: తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో
- యోహాను 5:30: నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.
- యోహాను 8:28b నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.
- యోహాను 12:49: ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.
తనకు తానుగా చేసినవి :-
- తన ప్రాణమును పెట్టినడు ౼ యోహాను 10:18
- తన తండ్రి పని చేయడం ఆహారంగా భావించాడు ౼ యోహాను 4:34
- తన్ను తానే తగ్గించుకున్నాడు ౼ ఫిలిప్ 2:8.
క్రీస్తు పంపబడిన విధానము :
యోహాను 17:18-19 నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.
దేవుడు ఎలా పంపాడో క్రీస్తు కుడా తన శిస్యులను అలాగునే పంపాడు.
ఆయన మానవుడే కాబట్టి శిస్యులను స్నేహితులని అంటున్నాడు ౼ లుకా 12:4; యోహాను 11:11 ; 15:13-15;
యేసు మనవలె పుట్టిన వాడు కానీ పరలోకములో ఉన్న దేవుడే రాలేదు..
యోహాను 3:16 ౼ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
అపో.కార్యములు 3:26: దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.
పంపబడినవాడు భూమి మీద బ్రతికిన తీరు :
యేసుక్రీస్తు బ్రతికిన తీరు సాటి సహోదరుని జీవనం వలె ఉంటుంది, ఏ నాడు కూడా పరలోకములో చేసుకున్న schedule ప్రకారం జీవించినట్టు కాదు కాని నిజ నరుని వలె బ్రతికాడు, ఆకలి, దప్పిక, శోధన, శ్రమ, కన్నీళ్లు, ప్రార్ధన, యచన, మొదలగునవి.. అందుకే తలంపులలో ఉన్న క్రీస్తు సహోదరుల వంటివాడు కావాల్సి వచ్చినది(హెబ్రీ 2:17), అంత గొప్పవాడు ససరిరుడుగా ప్రత్యక్షమగువలసి వచ్చెను(1 తిమోతి 3:16).
No comments:
Post a Comment