దేవుడు ఉన్నవాడు, కంటికి కనిపించనివాడు :- గాలి, ప్రాణము, కరెంటు, అనుభూతులు కంటికి కనిపించకపోయినా అవి ఉన్నవని నమ్ముచున్నాము..
దేవుడు ఉన్నాడు అని నమ్ముటకు ఆధారములు
1.సృష్టి ఆధారము :
ఆయన అదృశ్య లక్షణములను అనగా నిత్యాశక్తి, దేవత్వము సృష్టిలో విసదపరచేను. ౼ రోమా 1:19-20
- ఆకాశములు, అంతరిక్షము, రాత్రి, పగలు గూర్చి ఆలోచించుము. ౼ కీర్తన 19:1,2
- మృగములు, ఆకాశ పక్షులు, భూమి, సముద్రములోని చేపలు వాటి ఉత్పత్తిని ఆలోచించుము. ౼ యోబు 12:7-9.
2. సృష్టిలోని క్రమబద్ధత ఆధారము :
- ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం వాటి క్రమము చూడుము. ౼ అపొ.కా 14:17
- ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు. ౼ కీర్తన 148:3-7.
3. మానవుడు, దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారము :
- కీర్తన 139:13,14 ౼ నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి
- అపొ.కా 17:25-27 ౼ ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
పూర్వం మనిషి కోతి నుండి పుట్టాడు అని డార్విన్ సిద్ధాంతం నమ్మేడివారు కానీ ఇప్పటివరకు నిరూపించలేకపోయారు. ప్రపంచములో ఉన్న ప్రతి మానవుడు ఆది దంపతులైన హవ్వ ఆదాముల నుండే జన్మించారు. ౼ ఆది 2:7,21,22
4. యేసుక్రీస్తు ఆధారము:- యోహాను 1:18
- యేసుక్రీస్తు పుట్టాడు అనుటకు క్యాలెండర్, అతని వెనుకనున్న చరిత్రలు ఆధారము. యేసుక్రీస్తు దేవునుని బయలుపరచెను:
- జీవితము ద్వారా ౼ యోహాను 14:8-9
- బోధ ద్వారా ౼ మత్తయి 6:9
5. బైబిల్ ఆధారము :
40 మంది రచయితలు, 1500 సం”లు, ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధము లేదు, 66 పుస్తకములు ఒకే ప్రేరణతో ఒకని(దేవుని) సందేశమునే తెలుపుచున్నది. రాసిన విధానము :
- పరిశుద్త్మ ప్రేరణ వలన ౼ 1 పేతురు 1:20,21
- దైవ ఆవేశము వలన ౼ 2తిమోతి 3:16-17
ముగింపు:
- దేవుడు ఉన్నాడు అని నమ్మాలి ౼ హెబ్రీ 11:5
- మనం ఆయనను వివేకంతో వేదకావాలని దేవుడు కోరుచున్నాడు ౼ కీర్తన 53:1-3.
- దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు.౼కీర్తన 14:1.

No comments:
Post a Comment