బైబిల్ దేవుని గ్రంధామని నేనేందుకు నమ్మాలి?


ప్రపంచంలో అధిక శాతం ప్రజలకు క్రీస్తు గురించి తెలుసు(క్రీ.పూ, క్రీ.శ). నేడున్న సమాజంనులో దైవ గ్రంథములు అనబడేవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరో ఒకరితోనే రాయబడినవి. ఉన్న గ్రంధాలలో ఏది దైవగ్రంధం అనేది ఎలా తెలుసుకోవాలి బైబిల్ నే దైవ గ్రంధం అని ఎందుకు నమ్మాలి? బైబిల్ దేవుని గ్రంధామని చెప్పుటకు గల ఆధారము నేడు బైబిల్ నోటా నుండే విందాము..

బైబిల్ దేవుని గ్రంధం అని నమ్ముటకు గల కారణములు

1. సృష్టినిర్మాణము మరియు దాని క్రమము :
ఆది నుండి సృష్టి ఎలాగుండెనో నేడును అలాగునే నున్నది అందువలన బైబిల్ దేవుని గ్రంధామని నమ్మవలెను.
ఆది 1 అధ్యయమునందు –
  • వెలుగు – చీకటి, పగలు – రాత్రి.
  • ఆకాశము
  • భూమి, సముద్రము, విత్తనముల గల ఫలవృక్షుములు.
  • సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు.
  • జలచరములు, పక్షులు.
  • అడవి జంతులు, పశువులు, పురుగులు మరియు నరులు.
ఆదికాండము నందు ఏమి ఉన్నదో నేడు అదే ఉన్నది.
ఉదాహరణకు :
  • ఆకాశమందలి నక్షత్రము వాటి ఉపయోగము ౼ ఆది 1:14-16.
  • ఋతువులు ౼ ఆది 8:22; కీర్తన 74:16-17; అపో.కా 14:17.
  • పొలిమేరలు ౼ సామెతలు 8:29.

2. మానవ సృష్టి నిర్మాణము :
  • నరుడు నేలమంటి మరియు జీవ వాయువును గలవాడు ౼ ఆది 2:6-7.
  • ఆ నిర్మాణము :
    • అవయవ వ్యవస్థ
    • కండర వ్యవస్థ
    • రక్త వ్యవస్థ
    • ఎముకల వ్యవస్థ
    • నాడి వ్యవస్థ
  • వీటి అమరికలు ఎవరో ఒక అద్భుతమైన కళకారుడు చేసినట్టు ఉంటుంది, ఇందును బట్టి బైబిల్ దేవుని గ్రంధం అని నమ్మవలెను.

3. చారిత్రక ఆధారములు : కాల విభజన
  • క్రీస్తు పూర్వము & క్రీస్తు శకం :
    • క్రీ.పూ – క్రీ.శ రాజులు పరిపాలించిన రాజ్యములు వారి చుట్టూ ఉన్న అనేక జాతులు బైబిల్ నందు పొందుపరచబడినవి.
    • అషురీయులు, బబులోనీయులు, ఐగుప్తీయులు, కననీయులు, పిలిస్తీయులు మొదలగునవి.

4. బోగోళిక ఆధారములు :
  • దేశములు :
    • ఐగుప్తు, ఇటలీ, ఇజ్రాయేల్, ఇండియా ౼ ఎస్తర్ 1:1,8,9.
  • పట్టణములు :
    • యెరూషలేము, దామస్కు, రోమా, యెరికో, కాదేషు, మొదలగునవి.
  • సముద్రములు:
    • మధ్యధర, ఎర్ర, మృత, గలలియ మొదలగునవి.
  • నదులు :
    • యొర్ధను, నైలు, యప్రతీసు.
  • పర్వతములు :
    • సినాయి, అరారతు, లెబానోను, హెర్మోను.
ఇవన్ని నేటికిని మన మధ్యనే ఉన్నాయి, కావున వీటిని బట్టి బైబిల్ దేవుని గ్రంధామని నమ్మవచ్చును.

5. గ్రంథకర్తల ఐక్యత :
  • పుస్తకములు – 66
  • ప్రవక్తలు – 40 మంది
  • వ్రాయబడిన కాలము – 1500 సం”లు
  • భాషలు – హీబ్రు, గ్రీకు, అరమిక్.
  • ఖండాలు – ఆఫ్రికా, ఐరోప, ఆసియా.
  • వీరంతా ఒకే ప్రేరణతో రాసారు ౼ 2పేతురు 1:20,21 ౼ ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.
  • ఒకరితో ఒకరికి సంబంధములు లేవు, ఒకే కాలానికి సంబంధించిన వారు కారు అయినను ఒకే దేవుని గురించి, మానవుని గురించి, సృష్టి గురించి, మానవులు పొందబోవు స్వాస్థ్యము గురించి ఓకేలాగా రాయడం ఇది బైబిల్ గ్రంధామని నమ్మడానికి ఒక ఆధారం.

6. యేసుక్రీస్తు :
  • క్రీ.పూ – క్రీ.శ, క్రీస్తు ఉన్నాడు అనడానికి ఆధారం.
  • ఆయన తిరిగిన ప్రదేశములు.
  • ఆయన బోధలు,
  • ఆయన సిలువ వేసిన సందర్భములు.
  • ఆయన సమాధి నేటికి లేదు.
  • ఆయన రోజులలో ఉన్న అధికారులు, రాజులు, యూదులు, ఆయన శిస్యులు వారి చరిత్రలు ఆధారము.
  • ఆయన దేవుడు పంపితే వచ్చినవాడని, ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడని నేటికిని ఆధారములు ఉన్నవి.

7. పురావస్తు త్రావకాలు :
ఆర్కియాజిస్టులు జరిపిన త్రావకాలలో బైబిల్ ప్రతులు, బైబిల్ సంబంధిత ప్రాంతముకు, వస్తువులు బయట పడినవి. కనుక బైబిల్ దేవుని గ్రంధామని నమ్మవచ్చును.
  • మృత సముద్రపు చుట్టాలు,
  • ఊరు పట్టణము(అబ్రాహాము నివసించినది) క్రీ.శ 1954 త్రావకాలలో బయటపడినది – ఆది 11:28.
  • ఐగుప్తు ధాన్యపు గిడ్డంగులు, ఐగుప్తు శవ పేటికలు (పిరమిడ్స్), పరో రథ చక్రములు మొదలగునవి.
  • నోవహు ఓడ(ఆది 8:4) : టర్కీలోని అరారతు పర్వతంపై కనుగొనబడెను.
  • సొదొమా, గొమొఱ్ఱ ప్రాంతం గూర్చి దానికి జరిగిన సంభవానసంభవానికి బైబిలే ఆధారము, నేటికిని ఆ ప్రాంతం అలాగునే ఉన్నది.
    • ఆది 19:24-26 ౼ అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పుస్థంభమాయెను.

8. విజ్ఞాన శాస్త్రము(సైన్సు) ఆధారములు :
  1. తెలిస్కోప్ రాకమునుపే నక్షత్ర రాశులు విశ్వములో ఉన్నట్లు బైబిల్ తెలిపింది. అవి లెక్కింప శక్యము కానివి అని కూడా బైబిల్ చెపినది.
    • హెబ్రీయులకు 11:12 ౼ అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.
    • ఆది 15:5, యిర్మీయా 33:22.
  2. 21వ శతాబ్దములో శాస్త్రవేత్తలు పరిశోధించి ఒక నక్షత్రమునకు, మరొక నక్షత్రమునకు బేధము కలదని, ఒకొక్క నక్షత్రము వేరు వేరు ఉష్ణం, కాంతి గలవని చెప్పకముందే బైబిలులో దేవుడు ఈ విషయములను వ్రాయించాడు.
    • సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమవేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదముకలదు (1 కొరింథీ 15:41)
  3. క్రీ.శ 1910లో మిలుటిన్, కోవిచ్(యుగోస్లేవియా) 1990లో జాక్విన్ లష్కర్(అమెరికా) వీరు భువాతావరణములో చంద్రుని వలన ఋతువులు ఏర్పడతాయని చెప్పారు.
    • కీర్తనల 104:19 ౼ ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయకాలము తెలియును
  4. గాలికి బరువు ఉన్నాదని ముందే చెప్పిన బైబిల్ క్రీ.శ. 1783 లో జోసెఫ్ మౌంట్ మరియు జాక్వస్ “బలూన్ (Balloon)”ని కనుగొన్న తరువాత గాలికి బరువు ఉన్నాదని ప్రపంచం మొత్తం తెలుసుకున్నారు.
    • గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు (యోబు 28:25)
  5. భూమి గుండ్రముగా ఉందని క్రీ. పూ. 3వ శతాబ్దంలో అరిస్టాటిల్ కొన్ని పరిశోధనలతో తెలియజేసినప్పటికి, కాదు బల్లపరుపుగా ఉందని మరి మరికొందరు శాస్త్రవేత్తలు క్రీ.శ. 16వ శతాబ్దము వరకు వాదిస్తూనే ఉన్నారు. ఇలాంటి వాదనలు ఉన్న సమయములో “గెలీలియో” అనే శాస్త్రవేత్త క్రీ.శ. 16వ శతాబ్దములో పలు ప్రయాసల చేత భూమి గుండ్రముగా ఉందని నిరూపించాడు.ఇదే విషయాన్ని “దైవ గ్రంధమైన బైబిలు” క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే “యోబు” గ్రంధములో తెలియజేసింది.
    • ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెర వేర్చును (యోబు 37:12)
    • ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు. (యెషయా 40:22) He that sitteth upon the circle of the earth (Issiah 40:22)
  6. భూమి తిరుగుతూ ఉంటుంది అని గ్రంధం ముందుగానే చెపింది.
    • యోబు 9:6 ౼ భూమిని దాని స్థలములో నుండి కదలించు వాడు ఆయనేదాని స్తంభములు అదరచేయువాడు ఆయనే.
  7. క్రీ.శ 1978 లో భుగర్భ శాస్త్రవేత్తలు ౼ భూమి యొక్క అంతర్భాగంలోనికి వెళ్లుకొలది విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని క్రీ.పూ 1800 క్రితం బైబిల్ తెలియచేసింది.
    • యోబు 28:5 ౼ భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.
  8. భూమి శూన్యంలో వ్రేలాడుతుందని ముందే చెప్పిన బైబిల్ భూమి శూన్యంలో వ్రేలాడుతుందని కోపర్నికస్ అనే శాస్త్రవేత్త క్రీ.శ. 1475 లో కనుగొన్నాడు. ఇదే విషయాన్ని ఎన్నో విజ్ఞాన విషయములు కనుగొన్న “సర్ ఐజక్ న్యూటన్” కూడా 17వ శతాబ్దములో భూమి శూన్యంలో వ్రేలాడుతుందని నిరూపించి తెలియజేసాడు. అప్పటి నుంచి విద్యార్ధులకు భూమి శూన్యంలో వ్రేలాడుతుందని చెప్పడం ప్రారంభించారు. అయితే ఇదే విషయాన్ని “పరిశుద్ధ గ్రంధమైన బైబిలు” క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే “యోబు” గ్రంధములో తెలియజేసింది.
    • శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను. (యోబు 26:7)
  9. క్రీ.శ 1806-1873 Matthew Fontaine Maury అనే శాస్త్రజ్ఞుడు సముద్ర గర్భ శాస్త్రానికి పితామహుడు, అతడు నావికా దళములో పని చేసేవాడట, తన ఓడ ప్రయణమును కొనసాగిస్తూ ఒకనాడు కీర్తన 8 అధ్యాయం చదివామన్నాడు 8:8 లో “సముద్ర మార్గములన్నింటిలో” ఈ వచనమును బట్టి సముద్ర మార్గములను కనిపెట్టిన ఘనత మరేకే దక్కింది. https://en.m.wikipedia.org/wiki/Matthew_Fontaine_Maury
  10. ప్రాణం రక్తములో ఉన్నదని చెప్పిన బైబిల్ విలియం హార్వే క్రీ.శ. 1628 లో ప్రాణం రక్తములో ఉన్నదని చెప్పాడు. క్రీ.పూ. 14వ శతాబ్ధములోనే ఈ విషయాన్ని దేవుడు మోషే ద్వారా తన గ్రంధములో వ్రాయించాడు.
    • (ఆదికాండము 9:4,5; లేవికాండము 17:11)
    • రక్తము దేహమునకు ప్రాణము (లేవీకాండము 17:11) ఆది 9:4: రక్తమే దాని ప్రాణము.
  11. క్రీ.శ 1540లో కోపర్నికాస్ భూమికి హద్దులు ఉన్నాయి అని చెప్పాడు.
    • కీర్తనల 74:17: భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.
  12.  క్రీ.శ 1842లో మత్తు మందు కనుగొన్నారు.
    • ఆది 2:21:అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.
  13. సముద్ర జలములు సూర్యవేడిమి చేత ఆవిరిగా మారి, మేఘములుగా మారి వర్షం కురిసి నదులు, సముద్రాలు నిండుతున్నాయి అని ఇది ఒక జల చక్రం అని క్రీ.శ. 17వ శతాబ్దములో మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
    • ఈ విషయాన్ని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది. (కీర్తనలు 135:7; ప్రసంగి 1:7; యిర్మియా 10:13; యోబు 36:28).
    • నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును (ప్రసంగి 1:7).
    • భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును. (కీర్తనలు 135:7)
9. మొదటి శతాబ్ది చరిత్రకారుల రచనలు ఆధారము :
1. Flavius Josephus (AD 37-100)
2Tacitus (AD 56-120)
3. Herodotus (BC 484-425)

10. బైబిల్ నేడు సంపూర్ణ గ్రంధము :
  • 2తిమోతికి 3:16,17 : దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము(ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి)
    • ఉపదేశించుటకును,
    • ఖండించుటకును,
    • తప్పు దిద్దుటకును,
    • నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.
  • ద్వితీయో 4:2 ౼ మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు.

11. అనేక జీవితములలో బైబిల్ వెలుగుగా ఉన్నది :
  • బైబిల్ అనేక జీవితములలో వెలుగునిచ్చింది, వెలుగించినది.
    • ప్రసంగి 2:13
    • యోహాను 8:12
    • 1యోహాను 1:5-7
    • కీర్తన 119:9, 11, 25, 50, 57, 89, 97-100, 105, 128, 130.
    • కీర్తన 119:133
    • కీర్తన 138:2
    • 1యోహాను 2:8.

ముగింపు :
  • బైబిల్ దేవుని గ్రంధం అని చెప్పుటకు పైన ఇవ్వబడిన ఆధారములు సరిపోతాయి అనుకొంటున్నాను.

No comments:

Post a Comment