ముందు మాట :
- యూదుల బాషా శైలిలో ఆలోచన చేయాలి కానీ మన సొంత జ్ఞానము వలన అర్ధం కాదు.
- యెహోవాతండ్రి సకల యుగములలో రాజు ౼1తిమోతి 1:17
- యేసు ఒక యుదుడు, దావీదు కుమారుడు.
- సువార్తలలో రాయబడినవని జరిగిపోయిన సంఘటనలు వాటిని రచయిత ఇంకొకరిని ఉద్దేశిస్తూ రాస్తున్నాడు.
- అప్పటి సంస్కృతి ఆచార వ్యవహారాలను బట్టి సందర్భమును అర్ధం చేసుకోవాలి..
దేవుని కుమారుడు అనగా :
- దేవుని సింహాసనముపై కూర్చోండి దేవుని ప్రజలను దేవుని కొరకు ఏలువాడే దేవుని కుమారుడు.
- దావీదు సంతానము వాడే దేవుని సింహాసనముపై కూర్చుండువాడు, అతనే దేవునికి కుమారుడు.
పూర్వచరిత్ర :
యెహోవాతండ్రి సకల యుగములలో రాజు ౼ (1 తిమోతి 1:17)
ఇజ్రాయెల్ విడుదల నుండి సమూయేలు వరకు దేవుడు న్యాయాధిపతుల ద్వారా రాజ్యము చేసాడు కానీ సమూయేలు కుమారుల దుష్ట ప్రవర్తన ద్వారా ఇజ్రాయేల్ వారు బౌతికముగా రాజును కావాలి అని కోరాడం చూడగలము….
- 1సమూయేలు 8:1-5 ౼ సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠకుమారుని పేరు యోవేలు; రెండవవాని పేరు అబీయా, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరు కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.
- రాజు కావాలి అని కోరడంలో తమ్మును ఏలకుండా వారు దేవునినే నిరాకరించారు(1 సము 8:7) తన స్థానములో వారి పై ఎవరిని రాజుగా నియమించాలో దేవుడు ముందుగానే ధర్మశాస్త్రములో లిఖించాడు(ద్వితి 17:15-20). వారి ధర్మశాస్త్ర అంగీకరముతోనే ఆయన రాజ్య సింహాసనముపై కూర్చోండి, ఇశ్రాయేలును ఎలాడనికి దేవుడు బెన్యామీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి రాజుగా నియమించాడు ౼ (1 సమూయేలు 9,10 చు ..)
సౌలు తరవాత దావీదు రాజు అయ్యెను.
సౌలు దేవుని దృష్టికి అయోగ్యముగా నడుచుకుని అవిధేయుడైనడు. అతని తరువాత దినములలో దావీదును యెహోవా తన రాజ్య సింహాసనమందు దావీదును రాజుగా నియమించెను, ఆ దావీదు, దేవుని హృదయానుసారుడు అలాంటి దావీదుతో దేవుడు ఒక వాగ్దనము చేసాడు..
- 2 సమూయేలు 7:10-17 ౼ మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా – నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; “అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను; నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును;” అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శన మంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియ జెప్పెను.
- ఇందును గూర్చి దేవుడు దావీదుకు నిత్యా ప్రమాణము చేసెను. ౼ కీర్తనల గ్రంథము 89:4,28-37 చదువుము..
సొలొమోనుతో దావీదుకు చేసిన ప్రమాణము ప్రారంభమైనది :
- 1దినవృ 28:4-6 ౼ ఇశ్రాయేలీయుల మీద నిత్యము రాజునైయుండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి యింటివారందరిలోను నన్ను కోరుకొనెను, ఆయన యూదాగోత్రమును, యూదాగోత్రపువారిలో ప్రధానమైనదిగా నా తండ్రి యింటిని నా తండ్రి యింటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించియున్నాడు. యెహోవా నాకు అనేకమంది కుమారులను దయచేసి యున్నాడు, అయితే ఇశ్రాయేలీయులపైని యెహోవా రాజ్యసింహాసనముమీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొనియున్నాను, “నేను అతనికి తండ్రినైయుందును” అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును.
- నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రియైన దావీదునకు నేను సెల విచ్చియున్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలమువరకు స్థిరపరచుదును. ౼1రాజులు 9:5
దేవుని రాజ్యసింహాసనమందు కూర్చుండు దావీదు కుమారుడే, దేవుడు దావీదుకు చేసిన ప్రమాణమును బట్టి దేవుని కుమారుడు.
లేవి గోత్రపు యాజకులు – దేవుని దూతలైతే, యూదా గోత్రపు ప్రభువులు – దేవుని కుమారులు.
యూదా గోత్రం నుండి పుట్టిన దావీదు కుమారుడే యేసుక్రీస్తు.
యూదాలో ఇక భౌతికముగా రాజు అనేవాడు ఉండని పరిస్థితిని యొకన్యా(కొన్య) తీసుకొచ్చాడు ౼ (యిర్మీయా 22:24-30), అతని చేష్టల వలన వారు మరల దాస్యములోకి అప్పచెప్పబడిరి, తరవాత కొంత కాలానికి దేవుడు తన ప్రజలకు ఒక వాగ్దానమును చేస్తాడు.
- మీకా 5:2: బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.
- ఆ రాబోవు ఏలబోవువాడు యేసుక్రీస్తు అని మనకు తెలుసు ౼ మత్త 2:5.
యేసుక్రీస్తు ఎప్పటినుండి దేవుని కుమారుడు?
యేసు అనేక మార్లు అనేక చోట్ల ౼ నేను దేవుని కుమారుడిని అని ప్రకటించుకొనుట, చాలామంది యూదులు ఈయన దేవుని కుమారుడు అని విశ్వసించుట(యోహాను 1:47-49) యుక్తమే ఎందుకనగా ౼ దావీదు గర్భమందు నుండే యేసు దేవుని కుమారుడు, కానీ పునూరుద్దనము తరవాత పెంటుకొస్తు పండగ నాడు యేసు దేవుని కుమారుడు(అపో.కా 2:36) అని నిరూపణ/రుజువు చేయబడ్డాడు…
- ఉదాహరణకు :- నేను మా తాత ఆస్తికి అర్హుడునే నా చిన్నతనం నుండి ఈ ఆస్తికి వారసుడిని నేనే ఈ వారసుడిని నేను అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారసుడు కాబట్టి కానీ ఎప్పుడు వారసుడు అవుతాడు ఒక సమయం వచ్చాక నిరూపణ వలన ఆ మాట నిజం అగును.
అలాగే క్రీస్తు కూడా దేవుని కుమారుడె నిరూపణ వలన సర్వసృష్టికి declare చేసాడు..
నిరూపణకు సంబంధించిన వచనములు :
- అపో.కా 2:36 ౼ మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
- రోమీ 1:5 ౼ యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.
- మత్తయి 28:18 ౼ అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది.
యెహోవా రాజ్య సింహాసనమందు కూర్చుండువాడు ఎలాంటివాడు? అతని శక్తి సామర్ధ్యాలు ఎలాంటివి?
ఒక యుద్ధ సమయములో రాజు ఎలాంటివాడు అతని శక్తి సామర్ధ్యము ఎలాంటిది అనేది చెప్పిన ఒక సందర్భములో యెహోవ రాజ్యసింహాసనముపై ఉన్నవాడు ఎలాంటివాడో ప్రవక్త చెప్పడం చూడగలము..
- యెషయా 9:4-9 ౼ మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు. యుద్ధపుసందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను “ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును”. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది. అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజల కందరికి తెలియవలసియున్నది.
- రాజ్యసింహాసనమందు కూర్చుండువాడు ఎవరైతే యున్నారో అతను బలవంతుడు అతని శక్తిసామర్ధ్యాలు అలాంటివి. అని ప్రవక్త సెలవిస్తున్నాడు.
- అందుకే తోమా నా దేవా నా ప్రభువా నన్ను క్షమించు అంటాడు.
ఆ సింహాసనంపై కూర్చుండువారిని దేవుడు దైవములు అని పిలిచాడు ౼ కీర్తన 82
యేసుక్రీస్తు దేవునికి కుమారుడు, వారసుడుమనుష్యులందరికి ప్రభువు.
సొంత కుమారుడు అంటే?
ఎవరైనా తనకు పిల్లలు కావాలి అని కోరుకుంటారు, అలాగే దేవుడు తన సంకల్పము నిమిత్తం తన ప్రజల పాపముల నిమిత్తము ప్రత్యేకముగా తను సంకల్పించిన వానిని పుట్టించాడు అందుకే సొంత కుమారుడు అయ్యాడు...
ముగింపు :
- దావీదు సింహాసనము, యెహోవా సింహాసనము, రెండు ఒక్కటే – 1 దిన 28:5.
- దావీదు కుమారులలో యేసుక్రీస్తు ప్రముఖుడు మరియు ప్రథముడు.
- నేటికి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు దేవుని రాజ్య సింహాసనసీనుడై ఆత్మీయ ఇజ్రాయెలును ఎలుచున్నాడు.
- పెంటుకొస్తను పండగ నుండి యేసుక్రీస్తు రాజ్యపరిపాలన ప్రారంభమైనది.
- యేసుక్రీస్తు అందరికి ప్రభువు, మనుష్యులందరు ఆయన యొద్దకు రావాల్సిందే ౼ పిలిప్పి 2:9-11.

No comments:
Post a Comment