ముందుమాట :
- సృష్టికిమునుపు యేసు పరలోకములో, సర్వదికరైన దేవుడుగాకానీ, ఆత్మగా కానీ లేక వ్యక్తిగా కానీ లేడు అనేది గ్రహించాలి, దేవుని తలంపులలో ఉండి, దేవుడు పంపగా వచ్చాడు మన ప్రభువైన యేసుక్రీస్తు.
- సృష్టికిమునుపు యేసు యెహోవా పక్కన సర్వదికారియైన దేవుడిగా ఉన్నాడు అని విశ్వసించినయెడల ౼ చివరికి యేసు తన అధికారం పోగొట్టుకొని తండ్రి అధికారము క్రింద ప్రభువుగా నియమింపబడి పని చేస్తున్నట్టు చూడగలము..
పౌలు దృష్టిలో నిరంతరం స్తోత్త్రార్హుడైన దేవుడు ఎవరు? eulogētos
greek : eulogētos (స్తోత్రార్హుడు)
Hebrew : bârak (కీర్తన 41:13) ఈ పదమును ప్రతి సందర్భములోను యూదులు తండ్రికే వాడేవారు.
- 2కోరింథీయులకు 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక.
- ఎఫెసీయులకు 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక.
- 1పేతురు 1:3 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.
- రోమీయులకు 1:25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు (eulogētos), ఆమేన్.
- 2కొరింథీయులకు 11:31 నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న(eulogētos) మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.
అబద్ధమడటం లేదు అనిన సందర్భములో :
- 2కొరింథీయులకు 11:31 నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.
- రోమీయులకు 9:1-5 ౼ నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్య మైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై(eulogētos) యున్నాడు. ఆమేన్.
పౌలు దృష్టికోణములో ఉన్న దేవుడు తండ్రినే, 9:5 లో ఉన్న స్తోత్రార్హుడు(eulogētos) అనేది పౌలు తండ్రిని ఉద్దేశించినదే కానీ క్రీస్తును ఉద్దేశించినది కాదు, ఎందుకంటే తండ్రి అందరికి దేవుడు అని పౌలు రాసినాడు.
- ఎఫెసీయులకు 4:6 ౼ అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి(మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు.
ఇశ్రాయేలుకు ఈవులను ఇచ్చినది ఎవరు? ఏసా? లేక యెహోవానా?
రోమా 9:4-6
- దత్త పుత్రత్వము
- మహిమ
- నిబంధనములు
- ధర్మశాస్త్ర ప్రధానమును
- అర్చనాచారాదులును
- వాగ్దానములును చివరిగా
- క్రీస్తు
ఇశ్రాయేలులైన వీరికి దేవుడు చివరికి వారి కొరకు రక్షకుడైన క్రీస్తును పుట్టించాడు, అందుకు పౌలు క్రీస్తును పుట్టించిన దేవునికి “సర్వదికారియైన దేవుడు నిరంతరం స్తోత్రార్హుడు అని తండ్రికి స్తుతులు చెల్లిస్తున్నాడు”..
“దేవుడు ఎన్ను కొనిన యిస్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులుగ చేసికొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసికొని వారికి ధర్మశాస్త్రము నొసగెను. నిజమైన ఆరాధన వారిదే . దేవుని వాగ్దానములు పొందినది వారే వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక! ఆమెన్.” ౼ రోమీయులకు 9:4-5.
త్రిత్వవాదుల ఆలోచన ప్రకారం : సృష్టికి మునుపు యెహోవా కలిగియునట్టు యేసు కూడా సర్వాధికారము కలిగియుంట్టే తన సొంత అధికారమును ఎక్కడ వాడినాడు? ఆయనకు సర్వాధికారము లేదు కాబట్టే దేవుడిచ్చు అధికారమును పొందియున్నాడు..
సర్వాధికారి ఒక్కడే ఆయనే సమీపింపరాని తేజస్సులో ఉండువాడు :
అద్వితీయ అంటే ద్వితీయము లేనిది అని అర్థము, అద్వితీయుడునగు సర్వాధిపతి అనగా ఒక్కడే సర్వాధిపతి/సర్వాధికారి తన లాంటి ద్వితీయుడు లేనివాడని అర్థము.
- 1 తిమోతికి 6:15-16 శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు.
- ప్రకటన గ్రంథం 4:8: ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవిభూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.
- 1 కొరింథీయులకు 8:6 ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన నుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము.
ముగింపు :
- యేసుక్రీస్తు నిరంతరం తండ్రి పై ఆధారపడినవాడు, తండ్రి అధికారముతోనే సమస్తమును నిర్వహించుచున్నడే తప్ప తన సొంత అధికారము అంటూ ఏది లేదు.
- యోహాను 3:27: అందుకు యోహాను ఇట్లనెను తనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొందనేరడు.
- యేసుక్రీస్తు ఏ పని చేసిన తను తండ్రి అధికారముతోనే చేశాడు. పునరుద్ధరణ తరువాత కూడా తండ్రి అధికారముతోనే, ఇలా నిరంతరం.. యోహాను 16:15: తండ్రికి కలిగినవన్నియు నావి,

No comments:
Post a Comment