సామెతలు 8 అధ్యయములో ఉన్నది జ్ఞానమా లేక యేసుక్రీస్తునా?

ముందుమాట :

  • గ్రంధములో సాహిత్యము, అలంకరములు, పోలికలు, వర్ణనలు కలవు అనే విషయాన్ని చదువరి ఎపుడు గుర్తించుకోవలెను.
  • ఈ అంశాన్ని అన్వేషణాత్మకముగా పరిశీలన చేస్తూ తెలుసుకోవాలి.
  • సొలొమోను ఒక జ్ఞాని అనేది గుర్తు పెట్టుకోవాలి.
జ్ఞానము అనే పదము మూల భాషలలో :
  • హెబ్రీలో :
    • Strong’s h2451
    • Lexical: חָכְמָה
    • Transliteration: chokmah
    • Part of Speech: Noun Feminine
    • Phonetic Spelling: khok-maw’
    • Definition: wisdom.
    • Origin: From chakam; wisdom (in a good sense).
  • గ్రీకులో :
    • Strong’s g4678
    • Lexical: σοφία
    • Transliteration: sophia
    • Part of Speech: Noun, Feminine
    • Phonetic Spelling: sof-ee’-ah
    • Definition: wisdom, insight, skill (human or divine), intelligence.
    • Origin: From sophos; wisdom (higher or lower, worldly or spiritual).
జ్ఞానము అనగా ౼ పొగుచేసుకున్న సమాచారము అని అర్థము. క్రోత్త విషయలను తెలుసుకోవడము, సరైన సమయములో యుక్తిగా ప్రవర్తించడం.
సామెతలు 8:22-30 ౼ “పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను”. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.
ఈ వచనములు  చాలామంది విశ్వాసులు  పై వచనములను యేసుక్రీస్తుకు అన్వయింపజేసి ఇది యేసుక్రీస్తును గూర్చినదే అని బోధించెదరు, “ప్రదామమైన దానిగా” “నియమింపబడితిని” “ప్రధాన శిల్పి” అనే పదాలను బట్టి తమ సొంత ఊహను జోడించి సందర్భమును కలిపి చేరుపుతున్నారు, యేసుక్రీస్తు సృష్టికి ముందు పుట్టాడు అని, పుట్టి సృష్టి చేశాడని, యేసుక్రీస్తు కూడా సృష్టికర్త అని చెప్పుదురు.. నిజానిజాలు తెలియాలి అంటే ఆ సమస్య పరిశీలణాత్మకముగా చూస్తే సత్యం బయలుపడుతుంది..
1. ఇది యేసుక్రీస్తును గూర్చిన వచనములు కావు..
  • లూకా సువార్త 24:44 – అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను.
    1. ధర్మశాస్త్రము
    2. ప్రవక్తల గ్రంథములు
    3. కీర్తనల గ్రంధము
  • వీటిలోనే క్రీస్తును గూర్చిన సమాచారము ఉంటుందని స్వయాన యేసుక్రీస్తు ప్రభువు తన శిస్యులకు తెలియపరచాడు.
2. సొలొమోను ప్రవక్త కాదు :
  • సామెతలు, ప్రసంగి, పరమగీతము ప్రవక్తల గ్రంథములు కావు. అవి జ్ఞాన గ్రంథములు..
3. సామెతల గ్రంధములో వ్రాయబడినవి ప్రవచనాలు కావు.
  • ఎందుకంటే క్రొత్త నిబంధన గ్రంధములలో లేదా పత్రికలలో ఎక్కడ కూడా ఒక వచనము కూడా క్రీస్తు విషయములో నెరవరినట్టు సువార్తలు, గ్రంథములు, పత్రికలు తెలియపరచలేదు..
4. సొలొమోను రాజునే కానీ ప్రవక్త కాదు ఆయన జ్ఞాని :
  • ఆయన రాసిన సామెతలు ఎలాంటివి అంటే :
    • సామెతలు 1:1-4 ౼ దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొ మోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.
5. ఇందులోని మాటలు/సమాచారము ఒక జ్ఞాని ఉపదేశం చేస్తే ఎలా ఉంటుందో అలా అలంకరముగా ఉంటుంది :
  • 8 అధ్యయములో జ్ఞానాన్ని , వివేచనను వ్యక్తీకరించాడు.
  • 9:13 నుండి బుద్ధిహీనతను వ్యక్తీకరించాడు.
  • 5 లో జారత్వము(వ్యబిచారమును) వ్యక్తికరించాడు.
6. సామెతలు 8 లో ఉన్న జ్ఞానము స్త్రీనా లేక పురుషుడా?
  • స్త్రీగానే లేఖికుడైన సొలొమోను వర్ణించాడే గాని నిజముగా స్త్రీ అని కాదు, జ్ఞానము అనేది ఒక గుణము. గుణమును సొలొమోను వ్యక్తికరించాడు. సామెతలు 8 లో ఉన్నది వ్యక్తి అని అనుకుంటే స్త్రీ గానే సొలొమును రాసాడు కానీ పురుషుడుగా కాదు ఈ విధముగా చూసిన సామెతలు 8 కి క్రీస్తుకు సంబంధం లేదు అని అర్ధం అగుచునది.
    • At the top of the highways, at the meeting of the roads, she takes her place; Where the roads go into the town her cry goes out, at the doorways her voice is loud: ౼ (proverbs 8:2-3)
సామెతలు 8 అధ్యాయము పరిశీలన చేద్దాము:
  • జ్ఞానమును గూర్చి :
    • సామెతలు 8:1-4 ౼ జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది ౼ మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను.
  • క్రీస్తును గూర్చి :
    • యెషయా గ్రంథము 42:1,2 ౼ ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు.
  • జ్ఞానము :
    • సామెతలు 8:21 ౼ నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును. 
  • యేసుక్రీస్తు :
    • మరెందుకు యేసుక్రీస్తు ధనము గురించి ఇలా అంటున్నాడు?
    • మత్తయి 6:19 ౼ భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు;
    • మత్తయి 19:23 ౼ యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యేసుక్రీీస్తునే ఆ జ్ఞానము అయితే ఆయన జ్ఞానమందు ఎదగవల్సిన అవసరమేమి?
  • లూకా 2:52 – యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.
గమనిక :
  • 1కోరింథీ 1:24 ౼ ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.
    • పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిలాగా, దేవుని జ్ఞానములగా కనపడుతున్నాడు అని అర్ధం, ఆ సందర్భము సరిగా చదివిన యెడల అర్ధమగును.

ముగింపు :

  • యేసు క్రీస్తుకు రెండు జన్మలు లేవు.
  • సామెతలు 8 లో జ్ఞానాన్ని స్త్రీనిగా వ్యక్తికరించాడు సొలొమోను.
  • జ్ఞానము అనునది స్త్రీ కాదు, పురుషుడు కాదు అది ఒక గుణము.
  • జ్ఞానము ఎంత గొప్పది అనేది తెలియపరచుటకు జ్ఞాని అలంకరముగా రాసాడు.

No comments:

Post a Comment