యోహాను 8:58 "యేసు అబ్రాహాము పుట్టకమునుపే ఉన్నాడు"

యోహాను 8:58 ౼ యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

Ego eimi = i am

త్రిత్వం వారు ego eimi అనే గ్రీకు పదాలను చూసి దేవుని పేరు “యెహోవా(నేను ఉన్నవాడను)” అని చెప్పే గ్రీకు మార్గం అని చెప్పుదురు. అంటే ఆ ధోరణిలో చూస్తే అబ్రాహాముకు ముందు యెహోవాను అని క్రీస్తు సమర్దిస్తున్నట్టు ఉంటుంది వారి విశ్వాసం, అంటే యెహోవాయే యేసుక్రీస్తు అని..
★ ego(G1473) = I(నేను)
★ eimi(G1510) = am(ఉన్నాను)
  • లూకా 1:19 దూత “నేను(Iam) దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుట కును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.
  • లూకా 22:33 అయితే అతడు ప్రభువా, నీతో కూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా
  • మత్తయి 8:9 నేను(iam) కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.
  • మత్తయి 26:25 ఆయనను అప్పగించిన యూదాబోధకుడా, నేనా(Iam)? అని అడుగగా ఆయననీవన్నట్టే అనెను.
యోహాను 8లో నేను ఉన్నాను(ego eimi) అనే పదాలను యెహోవా అని ఒప్పుకొనిన వీరు ఈ పై పదాలను బట్టి ఎందుకు ఈ సందర్భాలలో యెహోవా అని ఒప్పుకోరు? దీనిని బట్టి ఏమి అర్ధం చేసుకోవాలి? యేసుక్రీస్తు అన్నట్టువంటి Iam (ego eimi) అనే దేవత్వమునకు ఎలాంటి సంబంధము లేదు అని అర్ధం అవుతుంది. సందర్భమును పదాల భావము మారుతూ ఉంటుంది అని అర్ధము చేసుకొనవలెను.

సందర్భం బాగా అర్థం చేసుకోవాలి:

యోహాను 8:51-59 ౼ ఒకడు నా మాట గైకొనిన యెడలవాడెన్నడును మరణము పొందడని (మూలభాషలో-మరణము చూడడని) మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అందుకు యూదులు నీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగుదుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడ డని నీవు చెప్పుచున్నావు. మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి. అందుకు యేసు నన్ను నేనే మహిమ పరచుకొనినయెడల నా మహిమ వట్టిది; మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమ పరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.
రెండు సంగతులు ఆలోచన చేయవలెను.
  1. అబ్రాహాము కంటే గొప్పవాడు
  2. అబ్రాహాము నా దినమును చూచి సంతోషించెను
  • మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? అని యూదులు అడిగినప్పుడు యేసు ౼ నేను అబ్రాహాము కంటే గొప్పవాడినే అనే విధముగా సమాధానం చెప్తాడు.
  • 56. మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను.
    • నా దినము అంటే అబ్రాహాము కంటే గొప్పవాని దినము అని అర్థము.
    • అబ్రాహాము, ఒక గొప్పవాని దినమును ముందే గ్రహించి ఆనందించాడు. అంతేకాని యేసు అనే పేరు అబ్రాహాముకు తెలియదు.
గలతియులకు 3:16 అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు.
క్రీస్తును బట్టి అబ్రాహాము రావాలని దేవుడు క్రీస్తును సంకల్పిస్తాడు. అంటే దేవుని సంకల్పములో ముందు ఉన్నది యేసుక్రీస్తు అనగా యేసుక్రీస్తు తరువాతే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, పౌలు, పేతురు etc..

యేసు అబ్రాహాము కంటే ముందే ఎలా ఉన్నాడు?

దేవుని తలంపులలో ఉన్నాడు, సంకల్పములో ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు క్రీస్తును సంకల్పించాడు. Like యిర్మీయాలగా ౼ యిర్మీయా 1:5 ౼ గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.
  • కొలొస్స 1:16-20 ౼ ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.
  • ఎఫెసీయులకు 1:3-12 ౼ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను. “ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను.” మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను(లేక,మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.
  • ప్రకటన 13:8 ౼ భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.
  • 1పేతురు 1:20 ౼ ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను.
  • అబ్రాహామును గూర్చి మనము ఆది 12 అధ్యాయం నుండి చూడగలము, కానీ క్రీస్తు ఆది 3:15 లో చూడగలము..
ఉదాహరణకు :
ఒకడు ఒక ఫోన్ తయారు చేయాలంటే ఆ ఫోన్ తాలూకా నమూనా ముందు తయారు చేసుకుంటారు. అంటే ఆ ఫోన్ ఎలా ఉండాలి ఏ features ఉండాలి ఇలా అవ్వలని ఆయన mind లో ముందే సంకల్పించబడటాయి, అలాగే దేవుడు ముందే సంకల్పించాడు అందరికంటే ముందే క్రీస్తు ఉన్నాడు..

ముగింపు :

  • చాలామంది దేవుని సంకల్పములో ఉన్న ములరాయిని వేతకక వారు వేరే వేరే వాటి మీద దృష్టి పెట్టినందున తప్పిపోవుచున్నారు.

No comments:

Post a Comment