
ముందుమాట :
- ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము 5 కాండముల రచయిత మోషే అని గ్రహించాలి.
- విషయాన్ని సందర్భానుసారంగా ఆలోచన చేయవలెను..
- సమాచారము కచ్చితంగా లభించని వాటికి అలాగునే విడిచిపెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఎలాంటి ఆధారము లేని వాటిపై మన సొంత అభిప్రాయమును రుద్దరాదు..
“ఆదికాండము 1:26-27 ౼ దేవుడు – మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.”
- పైగల పటంలో ఏక, బహు వచనములను గమనించుము, వాటిని ఆలోచించుము.
కొంతమంది పండితుల అభిప్రాయాలను ఆలోచన చేద్దాం..
Elohim (ఏలోహిమ్)
- పాత నిబంధనలో ఈ పదం 2600+ సార్లు ఉన్నది
- కొన్ని సందర్భాలలో ఏక వచనముగాను, కొన్ని సందర్భాలలో బహువచనముగాను కనబడును…
- ఈ పదం మనుస్యులకు(మోషే – ఆది 7:1) మరియు అన్య దేవతలకు, యెహోవాకు ఉపయోగించబడినది..
త్రిత్వం వారి ఖచ్చితమైన ఆలోచన శుద్ధ తప్పు :
ఆది 1:26 లోని “మనము, మన” అనే పదములు దేవత్వములోని తండ్రి కుమార పరిశుద్త్మ బహుళ్యమును సూచిస్తున్నట్టు వాడుకొనిరి. ఈ సిద్ధాంతమును బలపరిచే వచనములు : మత్తయి 3:16,17; 28:19; యోహాను 1:1-3; 10:30-33; 20:28; అపో.కా 5:3,4; రోమా 8:9-17,26-29; 2కోరింది 13:14; ఎపేసి 3:16-19; ఫిలిప్ 2:5-11; కొలసి 1:15-17; హెబ్రీ 1:1-5; యూదా 20,21; ప్రకటన 5:8-14.
మనము అనే దానిని అక్షర్ధముగా తీసుకుంటే ఇద్దరును మించి ఎంతమందైన ఉండవచ్చును కానీ ముగ్గురే ఉన్నారు అని భ్రమ పడుట సొంత ఉద్దేశములకు దారి తీసినట్టే..
ఈ పై వచనములు వాటి వాటి సందర్భములు వేరు వేరుగా ఉన్నవి, 1:26 సందర్భానికి సందర్బాసహితమైన వచనములను తెచ్చి సృష్టికి సంబంధించిన ఆది 1:26-27 కి ముడిపెట్టుదురు. అయినా కానీ ప్రేరేపించబడిన ఏ రచయిత కూడా ఎన్నడూ “మనము” మరియు “మన” అని సృష్టిని గూర్చిన పద ప్రయోగమును దేవత్వములోని ముగ్గురిని గూర్చిన భావమును సూచిస్తున్నట్టు చెప్పలేదు. పాత నిబంధనలో ‘ఏ ప్రవక్త’ కూడా “మన” అంటే తండ్రి కుమారుడు ఆత్మ ఉన్నారని చెప్పలేదు, ఈ వచనములను తిరిగి ఏ ప్రవక్త కూడా చర్చించలేదు, యేసుక్రీస్తు మరియు ఆయన శిస్యులు ఎన్నడూ వీటి ప్రస్తావన తీసుకురాలేదు, ఆ భావమును కూడా కలిగిలేరు. పైగా కొని చిక్కుముడులు ఉన్నాయి :
- సృష్టికి ముందు దూతలు మరియు దేవుడు, సెరపులు, కెరూబులు, ఉన్నాను కేవలం ముగ్గురే అనడం అవాస్తవం.
- మనుషులు, ముగ్గురు స్వరూపము ముగ్గురి పోలిక కలిగియుంటే, యేసుక్రీస్తు ఎందుకు తండ్రి స్వరూపము కలిగియున్నాడు? ఒకని స్వరూపాన్ని యేసు కలిగియుండటం ఏమిటి?ఆయానకంటూ ఒక స్వరూపము లేదా?
- మనము అంటే ఆ సందర్భములో ముగ్గురు 3 అనే అంకె ఉందని దేనిని బట్టి చెపుతున్నారు? అలా చెప్పడానికి ఏ ఆధారము లేదు.
- యేసుక్రీస్తు దేవుని(యెహోవా) స్వరూపి అని అనడములో అనాదిలో యేసుకంటు ఒక స్వరూపము, ఒక యేసు పోలిక లేదని అర్ధ0 వచ్చును.
- యేసు దేవుని స్వరూపము అయితే ఆదాము కూడా దేవుని స్వరూపినేగా అపుడు ఇద్దరు ఒక్కటేగా..
- 11 అధ్యయములో మనము దిగిపోయి అని ఉంటుంది దాని అర్ధం తండ్రి కుమార పరిశుత్మ ముగ్గురు దిగి వచ్చారు అనేగా ఆ ముగ్గురు భూమి మీదకు దిగి వచ్చారు అని నమ్ముదురా? అని అడిగితే అలా ఒప్పుకోరు.
కాబట్టి మన అంటే ముగ్గురు ఉన్నారు అనే ఆలోచన నిరాధరమైనది, ఒక్కడే ఉన్నాడు ఎపేసి 1:10 లో “తనలో తాను నిర్ణయించుకొనెను” అని ఉండును, ఇద్దరు ముగ్గురు ఉంటే నిర్ణయించుకోరు చర్చించుకుంటారు, దేవుని సంకల్పము, దేవుని చిత్తము, దేవుని ఆలోచనలు, ఈ పదములలో ఒక్కడే కనపడుతాడు కానీ ముగ్గురి సంకల్పము, ముగ్గురి చిత్తము అని ఉండదు. సృష్టి క్రమములో మన అంటే ముగ్గురు ఉన్నారని ఏ ప్రవక్తతో నిరూపిస్తావు. ఏ ఆధారము చూపెడతావు?
#1 పండితుల ఆలోచన :
దేవుడు నరుని తన స్వరూపమునందు మరియు తన పోలిక చెప్పున సృష్టించెను. మానవుడు బౌతికముగా దేవునివలె లేడు. అయితే ఆయన సృష్టి అంతటిలో ప్రజలు మాత్రమే ఆయన యొక్క ఆత్మీయ మేధస్సు మరియు నైతిక గుణములను పంచుకుంటున్నారు.
దేవుడు(Elohim) అను మాటకు హెబ్రీ పదము బహువచనములో ఉన్నది. ఆదికాండము యొక్క రచయిత అన్యుల పురాణ గాధలవలే అనేక దేవుళ్లు ఉన్నారని నమ్మకపోయినను అతను ఎందుకు బహుళ వచనమైన “దేవుడు(elohim)” ని ఏక వచనముగా వాడెను. ఇలా రాయడం వలన 1:26 బహు వివాదమునకు దారి తీసినది…
రచయిత ఆదికాండమును తన ముందు తరానికి రాసే సమయములో అక్కడి ప్రజలు బహు దేవతరాధన కలిగియుండిరి. ఆ ప్రజల దృష్టిలో దేవుని యొక్క ఉన్నత స్థానాన్ని Elohim గా చూచెదరు. దేవుని గుణములు మరియు శక్తుల సంపూర్ణత దేవత్వము నందు ఏకమైయున్నవని అప్పటి ప్రజల విశ్వాసము. (ద్వితీయో 32:17). ఇటువంటి దేవుని మహత్యము ప్రాముఖ్యముగా చూపుటకే రచయిత బహువచన పదములను ఏక వచన భావముతో ఆది 1:26లో ఉపయోగించేనని కొంత మంది బైబిల్ పండితుల విశ్వాసము.
ఉదాహరణకు : మనము మనకు తెలియని ఎదుటివానిని “నువ్వు” అని అనకుండా Respect గా “మీరు” అని ఎలా సంబోధిస్తునమో అలాగే. మరియు మన పాత సినిమాలలో రాజులు “మా వైభావమును చూచితివి, కదా మాతో నీకేమి..” అంటూ బహువచనముతో వారిని పోల్చుదురు.. అలాంటిదే ఇది కూడా అనే అభిప్రాయం..
#2 పండితుల ఆలోచనలు :
పాత నిబంధనలోని దేవుడు తరచుగా గొప్ప రాజు అని చెప్పబడ్డాడు, ఆయన తన సింహాసనముపై ఆశీనుడైయుండగా ఆయన చుట్టూ పరలోకపు దూతలు కుడియుండేవి.
- 1రాజులు 22:19-22 ౼ మీకాయా యిట్లనెను – యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి-నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా-ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను. అందుకతడు-నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన-నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.
- కీర్తనల 89:5-7 ౼ యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యము లను స్తుతించుచున్నది “పరిశుద్ధదూతల సమాజములో” నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు? పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు.
- యెషయా 6:1-8 లో “మా” అనే మాటలో పరలోకపు దూతలు సభ కూడా ఉమిడియుందని గుర్తించుకొనవలెను.
- యోబు 15:8: నీవు దేవుని “ఆలోచనసభలో” చేరియున్నవాడవా?నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?
పైన చెప్పబడిన వచనములను బట్టి త్రిత్వ సిద్ధాంతమునకు బదులు యెహోవా తన దూత గణముతో మాట్లాడుతున్నట్టు కనపడుచున్నది. అయితే దూతలు దేవుడు సృష్టిని చేయుటలో పాలుపొందిరి, వారు సృష్టికర్తలు కారుకాని దేవుడు చేయునాదంతటిని చూస్తూ దానిని బట్టి ఆయనను స్తుతిస్తూ పాలుపొందిరి ౼ యోబు 38:4-8 ౼ నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. నీకు తెలిసిన యెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు “దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు” దాని మూలరాతిని వేసినవాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?
అంటే దేవుడు తన దూతగణముతో తరచుగా సంభాషిస్తున్నాడు అని పై వచనముల ఆధారంగా అర్ధం అగుచున్నది. అలాగే తండ్రి సృష్టియందు నరుని సృజించుటలో వారితో పై సందర్భములవలె సంభాషించినని అర్ధం అగుచున్నది.
#3 పండితుల ఆలోచన :
1:26 మోషే అక్కడి ఇజ్రాయేల్ ప్రజలతో ౼ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు పలికినట్టు చెప్పి, 27 వచనములో దేవుని మాట ఏమిటి అనేది మోషే తెలియపరుస్తున్నాడు అని వారి అభిప్రాయం.
ఈ పండితులు చెప్పే విషయాలు కచ్చితము కాదు కాని అలా జరిగే అవకాశం ఉన్నట్టు అంచనా మాత్రమే..
ముగింపు :
ఆది 1:26 ఏమిటి అనేది పై ఏ అభిప్రాయాలను తీసుకొనిన ఇబ్బంది లేదు గాని, త్రిత్వం వారి ఖచ్చితముగా ముగ్గురే అనే అభిప్రాయం తప్పు అనేది గ్రహించాలి..
- మనము అంటే తండ్రి కుమార పరిశుద్త్మ ముగ్గురే అని చెప్పడానికి గ్రంథమందు ఖచ్చితమైన ఏ ఆధారము లేదు, అది ఊహ మాత్రమే. ఖచ్చితమైన ఆధారము ఉంటెనే దానిని ఇది అని చూపగలము.. లేనియెడల అభిప్రాయాలను మాత్రమే వ్యక్తపరిచాగలము.
- బైబిల్ ముగ్గురు కలిసి చేసిన సంకల్పము లేదు కేవలము ఒక్కడే చేసిన సంకల్పము మాత్రమే ఉన్నది అదే “దేవుని సంకల్పము”. బైబిల్ మొత్తముల్లో యేసు సంకల్పించిన ఒక చిన్న విషయం కూడా లేదు, ఎందుకు? ఆయన అసలు పరలోకములో వ్యక్తిగా లేనే లేడు, ఉంటే మనుషుల యెడల ఏదైనా ఒక చిన్న సంకల్పని కలిగియుండేవాడే..
- యోహాను 5:30 ౼ నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.
- రోమీయులకు 11:34: ప్రభువు(యెహోవా) మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
No comments:
Post a Comment